`ఎవ‌డు` బాట‌లోనే `ఎఫ్ 2`

F2 To Repeat Yevadu Movie Magic,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,F2 Movie Latest Updates,Venkatesh and Varun Tej Movie F2 Repeat Yevadu Movie Magic,Fun and Frustration Movie Updates
F2 To Repeat Yevadu Movie Magic

విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌ల‌సి న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఎఫ్ 2`. `ప‌టాస్‌`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌` చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న అనిల్ రావిపూడి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నాడు. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌`రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకీకి జోడీగా త‌మ‌న్నా… వ‌రుణ్ తేజ్‌కి జంట‌గా మెహ‌రీన్ న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమిటంటే… స‌రిగ్గా 5 ఏళ్ళ క్రితం `దిల్‌`రాజు సంస్థ‌లోనే రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ క‌థానాయ‌కులుగా వ‌చ్చిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఎవ‌డు` కూడా ఇదే జ‌న‌వ‌రి 12న రిలీజై మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో… సేమ్ ప్రొడ్యూస‌ర్ నుంచి సేమ్ డేట్‌కి రాబోతున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ కూడా అదే ఫీట్‌ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here