14 ఏళ్ళు పూర్తిచేసుకున్న నాగార్జున `మాస్`

14 Years For Nagarjuna Mass,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,14 Years Completed For Nagarjuna Mass Movie,Nagarjuna Mass Movie Completed 14 Years, Mass Movie Latest News
14 Years For Nagarjuna Mass

కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించ‌డంలో కింగ్ నాగార్జున శైలే వేరు. ఎవ‌ర్‌గ్రీన్‌ సెన్సేష‌న్ రామ్ గోపాల్ వ‌ర్మ నుంచి క‌ళ్యాణ్ కృష్ణ వ‌ర‌కు ప‌లువురు టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌ను తెలుగు ప‌రిశ్ర‌మ‌కు అందించిన ఘ‌న‌త ఈ టాప్ హీరోది. నాగ్ ప‌రిచ‌యం చేసిన కొత్త ద‌ర్శ‌కుల‌లో… రాఘ‌వ లారెన్స్ కూడా ఒక‌రు. డ్యాన్స్ మాస్ట‌ర్ గా, యాక్ట‌ర్ గా త‌న‌దైన ముద్ర వేసిన లారెన్స్ కి… డైరెక్ట‌ర్‌గా తొలి అవ‌కాశ‌మిచ్చాడు నాగ్. అవ‌కాశం అంటే కేవ‌లం హీరోగానే ప‌రిమిత‌మైపోవ‌డం కాదు… తానే ఆ చిత్రాన్ని నిర్మించి మ‌రీ ఛాన్స్‌ ఇచ్చారు ఈ స్టార్ హీరో. నాగ్ ఇచ్చిన ఆ అవ‌కాశం పేరే… `మాస్‌`. సింపుల్ రివెంజ్ స్టోరికి ఇంట‌రెస్టింగ్ స్క్రీన్ ప్లేని జ‌త చేసి నాగ్ అభిమానులు ఎప్ప‌టికీ స్మ‌రించుకునేలా… సినిమాను స్టైలిష్‌గా, చ‌క్క‌గా మ‌లిచారు ద‌ర్శ‌కుడు రాఘ‌వ లారెన్స్. డైరెక్ట‌ర్ గా త‌న‌కు ఇదే తొలి చిత్ర‌మైనా భావోద్వేగ సన్నివేశాల‌ను కూడా తెర‌పై చక్క‌గా ఆవిష్కరించారాయ‌న‌. ఇక టైటిల్‌లోనే మాస్ అనే మాట ఉన్నా, చేస్తున్న‌ది మాస్ క్యారెక్ట‌ర్ అయినా… త‌న‌కు మాత్ర‌మే సాధ్యమైన స్టైల్‌తో, రొమాంటిక్ ట‌చ్‌తో చిత్రాన్ని చాలా క్లాస్‌గా మార్చేసారు కింగ్ నాగార్జున‌. నాగ్‌కి జోడీగా జ్యోతిక‌, ఛార్మి న‌టించిన ఈ సినిమాలో సునీల్ ఓ కీల‌క పాత్ర పోషించాడు. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌సార‌థ్యంలో టైటిల్ సాంగ్‌తో స‌హా అన్ని పాట‌లు జ‌నాద‌ర‌ణ పొందాయి. 2004, డిసెంబ‌ర్ 23న విడుద‌లైన `మాస్‌`… నేటితో 14 వసంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

`మాస్‌`… కొన్ని విశేషాలు

* వ‌రుస‌గా మూడు సంవ‌త్స‌రాల పాటు డిసెంబ‌ర్ నెల‌లో మూడు విజ‌య‌వంత‌మైన చిత్రాల (‘మ‌న్మ‌థుడు’(2002), ‘స‌త్యం’(2003), ‘మాస్‌’(2004))ను అందించి… `మాస్‌`తో నిర్మాత‌గా హ్యాట్రిక్ విజ‌యాన్ని అందుకున్నారు నాగ్‌.

* ‘సంతోషం’, ‘మ‌న్మ‌థుడు’, ‘శివ‌మ‌ణి’, ‘నేనున్నాను’ త‌ర్వాత ‘మాస్‌’తో… క‌థానాయ‌కుడిగా వ‌రుస‌గా ఐదో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు ఈ టాలీవుడ్ మ‌న్మ‌థుడు. హీరోగా త‌న‌ కెరీర్‌లో ఐదు వ‌రుస విజ‌యాల‌ను అందుకోవడం ఇదే ప్ర‌థ‌మం.

* అలాగే ఈ ఐదు చిత్రాల్లో నాగ్ అనాథగా న‌టించిన మూడు సినిమాలు (‘సంతోషం’, ‘నేనున్నాను’, ‘మాస్’) మంచి విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం.

* `మాస్‌`కు ముందు `ఠాగూర్‌`లో న‌టించిన‌ప్ప‌టికీ… హీరోయిన్‌గా ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్‌లో జ్యోతిక న‌టించిన తొలి తెలుగు చిత్రం కూడా ఇదే కావ‌డం విశేషం.

* 2004లో దేవిశ్రీ ప్ర‌సాద్ ఆరు చిత్రాలకు సంగీత‌మందించ‌గా… వాటిలో ఐదు చిత్రాలు (‘వ‌ర్షం’, ‘వెంకీ’, ‘ఆర్య‌’, ‘శంక‌ర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌’, ‘మాస్‌’) క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట్ అయ్యాయి. ‘ఆర్య‌’, ‘శంక‌ర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌’, ‘మాస్‌’తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నాడు దేవిశ్రీ . ఇక `మ‌న్మ‌థుడు` త‌రువాత మ‌రోసారి నాగార్జున, అన్న‌పూర్ణ స్టూడియోస్ కాంబినేష‌న్ లో చేసిన ఈ సినిమాతో స్వ‌ర‌క‌ర్త‌గా మ‌రో మెట్టు ఎదిగాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=LVsE_Ge_AGo]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here