ప్ర‌భాస్20… 1960 కాలం నాటి ప్రేమ‌క‌థ‌

Prabhas 20 - a 1960 Love Story?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Prabhas 20 Movie Latest News,Prabhas 20 Movie Sets a 1960 Love Story,#Prabhas20,Prabhas New Movie Sets a 1960 Love Story
Prabhas 20 - a 1960 Love Story?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్… ఇటీవ‌లే క‌థానాయ‌కుడిగా 16 ఏళ్ళ ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్నాడు. ఈ జ‌ర్నీలో ప‌ద్దెనిమిది సినిమాల‌తో సంద‌డి చేశాడు. ప్ర‌స్తుతం రెండు చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ `బాహుబ‌లి` స్టార్‌. వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు 15న రిలీజ్ కానున్న `సాహో`.. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న 19వ సినిమా కాగా… `జిల్‌` రాధాకృష్ణ రూపొందిస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని పిరియాడిక్ ల‌వ్ స్టోరీ 20వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ 2020 సంక్రాంతికి రానుంది. కాగా… ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే… ఇందులో ప్ర‌భాస్ పాత‌కాలం నాటి కార్ల‌ను ఇష్ట‌ప‌డే వింటేజ్ కార్ ల‌వ‌ర్ గా క‌నిపించ‌నున్నాడట‌. అంతేకాదు… 1960 కాలం నాటి ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్ర‌భాస్ స్టైలిష్ లుక్స్‌తో సంద‌డి చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. మొత్తమ్మీద‌… 2020లొ ప్ర‌భాస్ 20 స‌రికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌న్న‌మాట‌.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=zECHmtibQD4]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here