ఆర్జీవీ వెన్నుపోటు – నమ్మించి..నమ్మించి ‘వెన్నుపోటు’ పొడిచారు

Vennupotu Full Song From RGV Lakshmi's NTR Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,RGV Lakshmi's NTR Movie Song,Vennupotu Full Song From RGV Lakshmi's NTR,Lakshmi's NTR Movie Songs,Vennupotu Full Song
Vennupotu Full Song From RGV Lakshmi's NTR Out Now

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ లైఫ్ లోకి లక్ష్మీ పార్వతి ఎంట్రీ అయిన తరువాత నుండి ఈ సినిమా ఉంటుందని ఆర్జీవీ సినిమా ప్రారంభించేప్పుడే చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ కు బయోపిక్ కు కౌంటర్ గానే ఈసినిమా తెరకెక్కుతుందన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమానుండి వెన్నుపోటు అంటూ సాంగ్ ను రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చాడు. అంతేకాదు ఈపాటలో లిరిక్స్ మాత్రం అందరినీ షాక్ కు గురుచేస్తున్నాయని చెప్పొచ్చు

మోసం..నమ్మించి నమ్మించి వెన్నుపోటు పొడిచారు..వంచించి వంచించి వెన్నుపోటు పొడిచారు…కుట్ర కట్ర.. పొంచి పొంచి పడగలే ఎత్తి వీళ్లు.. కుటిలనీతి విషమే చిమ్మినారు.. దొంగ ప్రేమ నటనలే చూపి వీరు..కలియుగానా శకునులై చేరినారు..అంటూ కళ్యాణి మాలిక్ సంగీతంలో.. సిరా శ్రీ రాసిన లిరిక్స్ వింటుంటే బాబోయ్ ఆర్జీవీ మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు. అంతే కాదు ఈ పాట పెద్ద చర్చలకు కూడా దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఒక్క వెన్నుపోటు అనే పాటే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో…చూద్దాం..

మరి ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9వ తేదీన.. ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు. మరి వీటిలో దేనికి కౌంటర్ గా సినిమా రిలీజ్ చేస్తాడో వర్మ చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here