సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దేశంలోనే మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా సైరా సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను వచ్చే ఏడాది స్వతంత్య్ర దినోత్సవం రోజు ఆగష్ట్ 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈలోపు ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ రోజు తమన్నా ఫుట్టినరోజు కావడంతో.. ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో తమన్నా లక్ష్మీ క్యారెక్టర్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
Introducing the stunning & sparkling @tamannaahspeaks as #Lakshmi from #SyeRaaNarasimhaReddy!
Team #SyeRaa wishes her a very happy birthday. #HBDTamannaah #SyeRaa pic.twitter.com/Ydrp0lgytx— Konidela Pro Company (@KonidelaPro) December 21, 2018
Wishing our gorgeous @tamannaahspeaks a very Happy Birthday! Here’s the stunning look of #Lakshmi from #SyeRaaNarasimhaReddy#HBDTamannaah #SyeRaahttps://t.co/x4Pe9Q56k7
— Konidela Pro Company (@KonidelaPro) December 21, 2018
ఇకపోతే సినిమాలో ఇప్పటికే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ఫినిష్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మరో వార్ షెడ్యూల్ తో బిజీ కానుంది.ముంబయిలో స్పెషల్ గా సెట్ చేసిన ఒక స్విమ్మింగ్ ఫూల్ లో వార్ సీన్స్ ను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో నయనతార, బిగ్ బి అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్ కిచ్చా వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.