పడి పడి లేచే మనసు తెలుగు మూవీ రివ్యూ

Padi Padi Leche Manasu Telugu Movie Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Padi Padi Leche Manasu Movie Review,Padi Padi Leche Manasu Review,Padi Padi Leche Manasu Movie Story,Padi Padi Leche Manasu Telugu Movie Live Updates,Padi Padi Leche Manasu Telugu Movie Plus Points,Padi Padi Leche Manasu Movie Review & Rating,Latest Telugu Movie Reviews,Padi Padi Leche Manasu Movie Public Talk,Padi Padi Leche Manasu Telugu Movie Public Response
Padi Padi Leche Manasu Telugu Movie Review

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా పడి పడి లేచె మనసు. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్స్‌, ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అయిందో లేదో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

నటీనటులు శర్వానంద్‌, సాయి పల్లవి, మురళీశర్మ, సుహాసిని
దర్శకత్వం : హను రాఘవపూడి
నిర్మాత : ప్రసాద్‌ చుక్కపల్లి, సుధాకర్‌ చెరుకూరి
సంగీతం : విశాల్‌ చంద్రశేఖర్‌

కథ:

సూర్య (శర్వానంద్) కలకత్తాలో ఫుట్‌బాల్ ప్లేయర్. కలకత్తాలో మెడిసిన్ చదివే వైశాలిని తొలిచూపులోనే చూసి ప్రేమలో పడతాడు. వైశాలి కూడా సూర్యని ఇష్టపడుతుంది. ఈ నేపథ్యంలో సూర్య దగ్గర వైశాలి పెళ్ళి ప్రపోజల్ తెస్తుంది. అయితే సూర్య మాత్రం.. ప్రేమలో ఉన్నంత హ్యాపీనెస్ పెళ్ళి అయితే ఉండదని.. వైశాలి పెళ్ళి ప్రపోజ్‌ని తిరస్కరించి లివింగ్ రిలేషిప్‌లో ఉందామంటాడు. దీనికి వైశాలి అంగీకరించదు. పెళ్లిలోనూ ప్రేమ ఉంటుందని తనను పెళ్లి చేసుకోవాలనిపిస్తే.. అప్పటి వరకూ తనపై ప్రేమ ఉంటే వచ్చే ఏడాది మళ్లీ ఇక్కడే కలుద్దాం అంటూ చెప్పి విడిపోాతారు. మరి విడిపోయిన  వారిద్దరూ ఎలా కలుస్తారు..?శర్వానంద్ పెళ్ళి వద్దనడానికి గల కారణమేంటీ? ఇవన్నీ తెలుసుకోవాలంటే రివ్యూ చూడాల్సిందే.

విశ్లేషణ:

అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హను రాఘవపూడి పడి పడి లేచే మనసుతో మరోసారి తన మార్క్ ను చూపించాడు. ఇక ఈ సినిమాకు ప్లస్ పాయింట్ హీరో హీరోయిన్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇలాంటి లవ్ స్టోరీలు చేయడంలో శర్వాకు మంచి ఎక్స్ పీరియన్సే ఉంది కాబట్టి మరోసారి తనదైన మెచ‍్యూర్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్‌, లవ్ సీన్స్‌తో పాటు కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు.

ఇక సాయి పల్లవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిదాతో నే అందర్ని ఫిదా చేసిన ఈ హైబ్రీడ్ పిల్ల.. మెడికోగా అందం, అభినయం కలబోసిన పాత్రలో తన మీద ఉన్న అంచనాలకు తగ్గ స్థాయిలో పెర్ఫమెన్స్ చేసింది.
బ్రేకప్ సన్నివేశంలో ఎమోషన్స్ సీన్స్‌లో జీవించేసింది. నిజం చెప్పాలంటే ఇద్దరూ పోటీ పడి మరి నటించినట్టున్నారు. అంతేకాదు ఇద్దరి మధ్య కెమెస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అయింది. ప్రియదర్శి, సునీల్‌, వెన్నెల కిశోర్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు. మురళి శర్మ, ప్రియా రామన్‌ తమ పాత్రల పరిది మేరకు ఆకట్టుకున్నారు.

ఇక స్టోరీ విషయానికొస్తే తొలి భాగాన్ని ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించిన హను.. ఇంటర్వెల్‌ సీన్‌ విషయంలో కాస్త తడబడ్డట్టుగా అనిపిస్తుంది. అయితే ఇద్దరూ విడిపోవడానికి బలమైన కారణం చూపించకపోవడం.. తిరిగి కలుసుకోవడానికి ఇద్దరూ మళ్లీ ప్రేమలో పడటం.. భూకంపం, హీరోయిన్‌కి మెమొరీ లాస్ లాంటివి ప్రేక్షకుల్ని గందరగోళానికి గురి చేశాయి.

ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ ను ప్రేమలో పడేయటం కోసం హీరో చేసే ఫీట్స్, సాహసాలతో సాగిపోతుంది. సెకండాఫ్ లో మెమొరీ లాస్ అయిన హీరోయిన్ ను మరలా ప్రేమలో పడేయడం అవే ఫీట్స్ ను రిపీట్ చేయడంతో సెకండాఫ్ సీన్స్ లో కాస్త సాగదీత కనిపిస్తుంది. కలకత్తా నేపథ్యాన్ని చాలా చక్కగా తెరకెక్కించినప్పటికీ…కథ మొత్తం హైదరాబాద్ లోనో..విజయవాడలోనో జరిగినట్టుగా.. అన్ని పాత్రలు తెలుగులో మాట్లాడటం విడ్డూరంగా అనిపిస్తుంది. చివరికి ఖాట్మండులో కూడా తెలుగులో మాట్లాడుతుండటం విచిత్రం. సినిమాటిక్ ఎక్స్ క్యూజ్ కోసం కొన్ని పాత్రల విషయంలో అలాంటి లిబర్టీ తీసుకోవచ్చు కానీ.. ప్రతి పాత్ర తెలుగులో మాట్లాడుతుంటే దానికి కలకత్తా వెళ్లడం ఎందుకనిపిస్తుంది.

విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు.
టెక్నికల్ పరంగా కూడా సినిమా చాలా రిచ్‌గా ఉంది . కోల్‌కతా, నేపాల్, ఖాట్మండ్‌లలోని అందమైన లొకేషన్లను సినిమాటోగ్రాఫర్ జే కే అద్భుతంగా చూపించారు.

ప్లస్‌ పాయింట్స్‌;
శర్వా నంద్, సాయి పల్లవి నటన
సంగీతం
లొకేషన్స్

మైనస్‌ పాయింట్స్‌;
సెకండ్‌ హాఫ్‌

 

Padi Padi Leche Manasu Telugu Movie Review
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here