అంతరిక్షం 9000 KMPH తెలుగు మూవీ రివ్యూ

Antariksham 9000 KMPH Telugu Movie Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Antariksham 9000 KMPH Movie Review,Antariksham 9000 KMPH Review,Antariksham 9000 KMPH Movie Story,Antariksham 9000 KMPH Telugu Movie Live Updates,Antariksham 9000 KMPH Telugu Movie Plus Points,Antariksham 9000 KMPH Movie Review & Rating,Latest Telugu Movie Reviews,Antariksham 9000 KMPH Movie Public Talk,Antariksham 9000 KMPH Telugu Movie Public Response
Antariksham 9000 KMPH Telugu Movie Review

ఘాజీ ఫేం సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా అంతరిక్షం సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిద్యమైన కాన్సెప్ట్ తో.. స్పేస్ నేపథ్యంలో తెలుగులో తొలిసారిగా తెరకెక్కిన ఈ సినిమా కావడం.. ఇప్పటికే విడుదలైన టీజర్ కు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. సముద్ర అంతర్భాగం నేపథ్యంలో ఘాజీ సినిమా తీసి అందర్ని మెప్పించిన సంకల్ప్ రెడ్డి ఈ సినిమాతో మెప్పించాడా లేదా? వరుణ్ హ్యాట్రిక్ కొట్టాడా లేదా..? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

నటీనటులు – వరుణ్ తేజ్, అదితీ రావు హైదరి, లావణ్య త్రిపాఠి
డైరెక్టర్ – సంకల్ప్ రెడ్డి
బ్యానర్ – ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్
నిర్మాతలు – క్రిష్ జాగ‌ర్ల‌మూడి, సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి
సినిమాటోగ్ర‌ఫీ – జ్ఞాన‌శేఖ‌ర్
సంగీతం – ప్ర‌శాంత్ విహారి

కథ:

ప్రపంచం మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ కి సంబంధించిన ప్రాబ్లమ్ ఫేస్ చేయనుందని పసిగట్టిన ఇండియన్ స్పేస్ స్టేషన్ దాన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలని డిసైడ్ అవుతారు. దీంతో దేవ్(వరుణ్ తేజ్) ఒక నిర్ణయం తీసుకుంటాడు. అయితే దేవ్ తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. దీనిలో భాగంగానే దేవ్.. అదితిరావ్ హైదరి బృందం స్పేస్ లోకి వెళ్లడానికి నిర్ణయించుకుంటారు. స్పేస్ లోకి వెళ్లిన దేవ్ టీమ్ ఊహించని పరిణామాలను ఎలా ఎదుర్కొంటుంది..? మిహిర అనే శాటిలైట్‌లో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి వరుణ్ తేజ్, అదితిరావు హైదరి ఎలా కృషి చేశారు అన్నది సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ:

విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకొంటూ హిట్లు కొడుతున్న మెగా హీరో వరుణ్ తేజ్… ఇప్పుడు మరో విభిన్నమైన కాన్పెప్ట్ తో వచ్చాడు. ఈ సినిమాలో కూడా వరుణ్ తేజ్ తన నటనతో మంచి మార్కులే కొట్టేశాడు. తొలి భాగమంతా అంతా పాత్రల పరిచయాలతోనే ముగిసింది. ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ కి పూర్తి కథ మీద ఒక క్లారిటీ వస్తుంది. రెండో భాగంలో అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్‌ను దర్శకుడు అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించాడు. సెకండాఫ్ మొత్తం పూర్తిగా స్పేస్ బ్యాక్ డ్రాప్‌లోనే ఉండటంతో… దర్శకుడు విజువల్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. క్లైమాక్స్‌ ఈసినిమాకు మరో హైలెట్ గా నిలిచింది.

ఇక అంతరిక్షంలో స్పేస్ సైంటిస్టుగా కనిపించిన అదితిరావు హైదరీ… సమ్మోహనం తరువాత ఫెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించింది. ఈ చిత్రం కోసం రోప్ టెక్నాలజీలో కూడా శిక్షణ తీసుకుంది. తన పాత్ర వరకూ చాలా చక్క గా నటించింది. లావణ్య త్రిపాఠి కూడా తన పాత్ర మేరకు తాను నటించింది.

స్పేస్ టెక్నాలజీలో దర్శకుడికి ఉన్న పట్టు అవగాహనలను అభినందించాలి. హాలీవుడ్ సినిమాల స్క్రీన్ ప్లే అండ్ మేకింగ్ స్టాండర్ట్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఒక ప్రాంతీయ భాషా చిత్రాన్ని రూపొందించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటి ఒక ఉన్నత సాంకేతిక విలువలు గల చిత్రంలో సాధ్యమైన మేరకు మెలో డ్రామాకు అవకాశం ఉండదు. కానీ దర్శకుడు స్పేస్ టెక్నాలజీని..హ్యూమన్ ఎమోషన్స్ ను కనెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది.

సగటు ప్రేక్షకుల ఎంటర్ టైన్ మెంట్ ను కామెడీ, ఫైట్స్, ఐటెం సాంగ్ అంటూ రీలుకొక ఫార్ములా ఎలిమెంట్ ను ఎక్స్ పెక్ట్ చేసే మసాలా మైండ్స్ కు ఇలాంటి సినిమాలు రుచించక పోవచ్చేమో కానీ..క్రియేటివిటీని అద్భుతమైన టెక్నాలజీతో అనుసంధానం చేసి రూపొందించిన అంతరిక్షం నిజంగా ఓ అద్భుతం.

ఘాజీ చిత్రంలో మెరైన్ టెక్నాలజీ మీద ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ మీద గొప్ప కమాండ్ ను కనబరిచిన సంకల్పరెడ్డికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకంగా నిలిచింది. ఇక కెమెరా పనితీరు సినిమాకు మరో ఆయుధమని చెప్పొచ్చు. రంగస్థలం సినిమాకు ఆర్ట్ వర్క్ అందించిన రామకృష్ణ సబ్బాని, మోనిక నిగోట్రే ఈ చిత్రానికి కూడా హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్ట్ వర్క్ ను అందించారు. వీరి ఆర్ట్ వర్క్ తో మరోసారి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యారు.

ప్లస్ పాయింట్స్:
* నటీనటులు
* విజువల్స్
* బ్యాక్ గ్రౌండ్ స్కోర్
* సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ చెప్పడం కంటే..చిత్ర యూనిట్ చేసిన కొత్త ప్రయోగాన్ని అభినందిచాల్సి ఉంటుంది.

ఓవరల్ గా మరో వైవిధ్యమైన స్టోరీతో వచ్చిన వరుణ్ తేజ్ మరో మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాడని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 

Antariksham 9000 KMPH Telugu Movie Review
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3.3
Sending
User Review
0 (0 votes)

 

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here