వెన్నుపోటు ఆడియో, వీడియో ట్రైలర్ రిలీజ్

Lakshmi's NTR Vennupotu Song and Video Promo Out Now,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Lakshmi's NTR Movie Latest News,Vennupotu Song From Lakshmi's NTR Movie,Lakshmi's NTR Movie Songs,Vennupotu Video Song From RGV Lakshmi's NTR Movie
Lakshmi's NTR Vennupotu Song and Video Promo Out Now

టాలీవుడ్ లో వరుసపెట్టి బయోపిక్ లు తీస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించే పనిలో ఉండగా… మరోపక్క మహి వి. రాఘవ్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తీస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ లో ఉండగానే…తాను కూడా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నానని…క్రిష్ తీసే బయోపిక్ లక్ష్మీ పార్వతి ఎంట్రీ కాకముందు వరకూ ఉంటే..తాను తీయబోయే సినిమా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి వచ్చిన తరువాత నుండి ఉంటుందని అప్పుడే అందరికీ షాకిచ్చాడు.

ఇక ఇప్పుడు మరోసారి వెన్నుపోటుతో ఎన్టీఆర్ కు రామ్‌గోపాల్‌ వర్మ కౌంటర్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈసినిమా నుండి వెన్నుపోటు పాట ఆడియో వీడియో ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. మరి ఈ పాటతో ట్రైలర్ తోనే అందరికీ షాకిచ్చిన వర్మ..మొత్తం సినిమాతో ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. సో ‘ఎన్‌టిఆర్‌ కథానాయకుడు’ ట్రైలర్‌కి పోటీగానే రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నుంచి ‘వెన్నుపోటు’ పాటని విడుదల చేసినట్టు లేదు!

మరి ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9వ తేదీన.. ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు. మరి వీటిలో దేనికి కౌంటర్ గా సినిమా రిలీజ్ చేస్తాడో వర్మ చూద్దాం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here