2018 టాలీవుడ్ లో సందడి చేసిన కొత్త హీరోయిన్లు

Tollywood Actresses Who Made Their Debut in 2018,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Telugu Actress Their Debut in 2018,2018 Tollywood Actress With Their Own Debut,Telugu Actresses Who Made Their Debut in the Year of 2018,Tollywood New Heroines in 2018
Tollywood Actresses Who Made Their Debut in 2018

2018 ఏడాది చివరి దశకు వచ్చేసింది. ఇక ఏడాది ఎన్నో సినిమాలు రిలీజయ్యాయి.. ఇంకా ఈ నెల చివరిలో దాదాపు అరడజను సినిమాల వరకూ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి…బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకటైతే ఈ ఏడాది మాత్రం టాలీవుడ్ లో కొత్త హీరోయిన్లు సందడి చేశారని చెప్పొచ్చు. ఎప్పుడూ లేనంతగా..ఈ ఒక్క ఏడాదే చాలా మంది ముద్దుగుమ్మలు తెలుగు తెరమీద హంగామా చేశారు. అందులో కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. మరి ఈ ఏడాది టాలీవుడ్ లో సందడి చేసిన ఆ కొత్త హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం…

రష్మిక

 

ఈ ఏడాది ప్రారంభంలోనే వెండితెరకు పరిచయమైన హీరోయిన్ రష్మిక. ఆరంభమే ఓ మంచి హీరోయిన్ తో అయిందని చెప్పొచ్చు. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక..తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత గీత గోవిందం సినిమా కూడా మంచి హిట్టవ్వడంతో ఇప్పుడు బిజీ హీరోయిన్ అయిపోయింది.

కియారా అద్వాని

 

తెలుగు తెరకు పరిచయమైన మరో బ్యూటీ కియారా అద్వాని. బాలీవుడ్ లో ధోనీ సినిమాతో ప‌రిచ‌యం అయిన ఈ భామ‌.. ఇక్క‌డ భ‌ర‌త్ అనే నేనుతో అడుగుపెట్టింది. ఓ రకంగా కియారా అద్వాని చాలా లక్కీ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ స్టార్టింగే సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో పనిచేసే లక్కీ ఛాన్స్ దొరికింది. భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో కియార్ లక్ మారిపోయింది. అంతేనా ఇప్పుడు మరో స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ పక్కన విన‌య విధేయ రామ‌లో నటిస్తోంది.

పాయల్ రాజ్ పుత్

 

చిన్న సినిమాతో వచ్చి పెద్ద సక్సెస్ అందుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ తన బోల్డ్ నటనతో అందర్నీ ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. మొదటి సినిమాలోనే కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ లో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇక ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత… పాయల్ రాజ్ పత్ కు వరస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం పలు సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

నభా నటేష్

 

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మరో టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్. నిజం చెప్పాలంటే ఈసినిమాలో సుధీర్ బాబు కంటే నభా నటేష్ నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. తన సహజమైన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ భామ ఇప్పుడు ర‌వితేజ డిస్కో రాజాలో మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంది.

నిధి అగ‌ర్వాల్

 

తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన అందాల నిధి బ్యూటీ నిధి అగ‌ర్వాల్. స‌వ్య‌సాచి సినిమాతో నాగ‌చైత‌న్య‌తో కలిసి నటించిన ఈ హీరోయిన్ కు గ్లామర్ పరంగా ఫుల్ మార్కులే కొట్టేసింది. అంతేనా అన్నతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అమ్మడు.. తమ్ముడు అఖిల్ తో కూడా నటిస్తుంది. మిస్ట‌ర్ మ‌జ్ను అనే సినిమాలో అఖిల్ తో కలిసి నటిస్తోంది. దానితో పాటు మరికొన్ని సినిమాలు క్యూలో ఉన్నాయి.

ప్రియాంక జవాల్కర్

 

ఇక పైన తెలిపిన వారందరూ ఇక్కడికి దిగుమతి అయిన హీరోయిన్లే. కాస్త సంతోషపడాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమై మంచి సక్సెస్ అందుకున్న తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. మరాఠి అమ్మాయి అయినా అనంత‌పురం అమ్మాయిగానే మంచి గుర్తింపువచ్చింది. తెలుగు చక్కగా మాట్లాడుతుంది. ఇక టాక్సీవాలా సినిమా మంచి విజయం సాధించడంతో.. ప్రియాంకకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఇప్పుడు పలు ఆఫర్లు ప్రియాంక చేతిలో ఉన్నాయి.

వీళ్లే కాదు వీళ్లతో పాటు ఇంకా ఈ ఏడు చాలామంది హీరోయిన్లే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. వారి టాలెంట్ ను చూపించారు. మొత్తానికి ఈ మధ్య టాలీవుడ్ లో కాస్త హీరోయిన్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో…ఈ ఏడాదితో ఆ కొరత కాస్త తగ్గుతుందేమో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=w40vvd_nSf8]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here