మ‌రోసారి పాత‌ టైటిల్‌తో రానున్న ‘అల్ల‌రి’ న‌రేష్‌?

Allari Naresh to Work With the Old Title Again,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Allari Naresh Next Movie Latest News,Allari Naresh Upcoming Movie Title,Hero Allari Naresh New Movie Title,Allari Naresh Next Movie With Old Title Again,Actor Allari Naresh Latest Movies Updates,Allari Naresh New Movie Updates
Allari Naresh to Work With the Old Title Again

బంగారు బుల్లోడు‘ (1993)… బాల‌కృష్ణ‌, ర‌మ్య‌కృష్ణ‌, ర‌వీనా టాండ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద విన్న‌ర్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే సినిమా టైటిల్‌తో తెలుగులో మ‌రో మూవీ రాబోతోంద‌ని స‌మాచారం. ఆ వివ‌రాల్లోకి వెళితే… 2002లో విడుద‌లైన‌ ‘అల్ల‌రి’ సినిమాతో తెలుగు తెర‌కు కామెడీ హీరోగా ప‌రిచ‌య‌మై… ఆ చిత్రం పేరునే త‌న ఇంటి పేరుగా మార్చుకున్న న‌టుడు ‘అల్ల‌రి’ న‌రేష్. ఆ త‌రువాత ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో సంద‌డి చేసిన న‌రేష్… 2012లో విడుద‌లైన ‘సుడిగాడు’ త‌రువాత మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకోలేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో… త‌దుప‌రి చిత్రం విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం… గిరి ద‌ర్శ‌క‌త్వంలో న‌రేష్ ఓ మూవీ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా క‌థానుసారం ‘బంగారు బుల్లోడు’ టైటిల్ అయితే బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుడు భావించాడట‌. అందుకే ఆ టైటిల్ హ‌క్కుల‌ను కూడా సొంతం చేసుకున్నార‌ని వినికిడి. అయితే… ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇంత‌కుముందు కూడా ‘అల్ల‌రి’ న‌రేష్ కొన్ని పాత టైటిల్స్ తో సినిమాలు చేశారు. ‘సుంద‌ర‌కాండ‌’, ‘గ‌మ్యం’, ‘అహ నాపెళ్ళంట‌!’, ‘య‌ముడికి మొగుడు’, ‘బందిపోటు’ చిత్రాలు ఆ త‌ర‌హా టైటిల్స్ తో వ‌చ్చిన‌వే. వీటిలో ‘గ‌మ్యం’, ‘అహ నాపెళ్ళంట‌!’ విజ‌యం సాధించాయి. ఈ క్ర‌మంలోనే వ‌స్తున్న ‘బంగారు బుల్లోడు’ కూడా… ‘అల్ల‌రి’ న‌రేష్‌కు ప్ల‌స్ అవుతుందేమో చూడాలి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ప్ర‌స్తుతం ‘అల్ల‌రి’ న‌రేష్ కీ రోల్ ప్లే చేస్తున్న మ‌హేష్‌బాబు 25వ చిత్రం ‘మ‌హ‌ర్షి’ కూడా పాత సినిమా టైటిల్ కావ‌డం విశేషం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=HY0EU3Pvic4]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here