ఓటు హక్కు వినియోగించుకున్న మన సెలబ్రిటీస్

#TelanganaElections2018, Telangana Assembly Elections 2018 Live Updates, Telangana Elections 2018, Telangana Polls 2018, Telugu Filmnagar, Tollywood Actors Claim Their Valuable Vote, Tollywood Celebrities Cast their Vote, Tollywood Celebrities Claim Their Right by Delivering Their Valuable Vote, Tollywood Celebrities Claim Their Valuable Vote, Tollywood Celebs Voting Elections 2018, Voting Rights Claimed by our Celebrities
Voting rights claimed by our celebrities

రాజకీయాలకు..సినిమాలకు అవినాభావసంబంధం ఉండనే ఉంటుంది. ఎంతోమంది సినీ ప్రముఖులు కూడా రాజకీయాల్లో చక్రం తిప్పిన వారున్నారు. ఇక ఈరోజు ఎలక్షన్ డే కావడంతో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సామాన్య ప్రజల్లాగానే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ఓటు హక్కు వినియోగించుకేనేందుకు సాధారణ ప్రజానికంతో పాటు.. నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అంతేకాదు..ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని కూడా పిలువునిస్తున్నారు. మరి తమ ఓటు హక్కును వినియోగించుకున్న రెస్పాన్సిబుల్ సెలబ్రిటీస్ ఎవరో చూద్దాం..

జూనియర్ ఎన్టీఆర్ – జూనియర్‌ ఎన్టీఆర్.. తన తల్లి, భార్య ప్రణతితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌ రెడ్డి స్కూల్‌లో ఓటేశారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ.. అందరికీ అనుకూలంగా ఉండేవాడే లీడర్‌ అన్నారు. మంచి లీడర్లనే కోరుకుంటున్నామని.. అందరూ తప్పకుండూ ఓటేయాలన్నారు.

రాజేంద్ర ప్రసాద్ – ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత అన్నారు ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌.. ఓటు విషయంలో బద్దకం పనికిరాదని.. ఓటు వేస్తే జీవితంలో చాలా మంచి జరుగుతుందంటున్నారు.

రాజమౌళి – జూబ్లీహిల్స్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్‌లోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రాజమౌళి. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here