సుబ్రహ్మణ్యపురం తెలుగు మూవీ రివ్యూ

#SubrahmanyapuramReview, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies 2018, Subrahmanyapuram Movie Live Updates, Subrahmanyapuram Movie Plus Points, Subrahmanyapuram Movie Public Reponse, Subrahmanyapuram Movie Review, Subrahmanyapuram Movie Review and Rating, Subrahmanyapuram Movie Story, Subrahmanyapuram Review, Subrahmanyapuram Telugu Movie Public Talk, Subrahmanyapuram Telugu Movie Review, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Subrahmanyapuram Telugu Movie Review

గత కొద్దికాలంగా ఫ్లాప్ లతో తడబడుతున్న సుమంత్ మళ్లీరావా సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ జోరు మీదే వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన సినిమా సుబ్రహ్మణ్యపురం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ట్రైలర్ తోనే ఆసక్తిని రేపిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా.. సుమంత్ కు మళ్లీ హిట్టిచ్చిందా తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

నటీనటులు : సుమంత్ , ఈషా రెబ్బా, సీనియర్ నరేష్ తదితరులు.
దర్శకత్వం : సంతోష్ జాగర్లపూడి
నిర్మాత : సుధాకర్ రెడ్డి
సంగీతం : శేఖర్ చంద్ర

కథ:

నాస్తికుడిగా, దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి కార్తిక్ (సుమంత్). పురాతన దేవాలయాలపై రీసెర్చ్ చేస్తూంటాడు. అయితే సుబ్రహ్మణ్యపురంఅనే గ్రామంలో ..వరసగా ఆత్మహత్యలు జరుగుతూంటాయి. పోలీస్ (అమిత్ శర్మ) ఈ ఆత్మహత్యలకు కారణం ఏమిటో కనిపెడదామని ఇన్విస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఈ నేపథ్యంలో సుమంత్ కి ఈ ‘సుబ్రహ్మణ్య’ దేవాలయం గురించి, అక్కడ జరిగే సూసైడ్స్ గురించి తెలుస్తుంది. దాంతో ఆసక్తి పెరిగి..ఈ సూసైడ్స్ వెనక ఉన్న శక్తులను పట్టుకోవాలని, ఈ మిస్టరీ ని విడితీయాలని సుబ్రహ్మణ్యపురం వస్తాడు. అక్కడ ఈ చావుల వెనుక ఎవరో ఉన్నారని..ఎవరో కావాలని చేస్తున్నారని తెలుసుకుంటాడు. ఈలోగా కార్తిక్ ఫ్రెండ్ మేఘన చనిపోతుంది. దాంతో పది రోజుల్లో ఈ మరణాల వెనక ఉన్న మిస్టరీ ఏంటో కనిపెడతానని ఆ ఊరి వాళ్ళతో ఛాలెంజ్ చేస్తాడు. మరి సుమంత్ చావుల వెనుక ఉన్న మిస్టరీని ఎలా ఛేదిస్తాడు..? ఆ చావుల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ‘సుబ్రహ్మణ్యపురం’లో దాగిన మర్మం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

కార్తీక్ గా సుమంత్ పర్ఫెక్ట్ గా సూటయ్యాడని చెప్పొచ్చు. ఈషా రెబ్బ..విలేజ్ అమ్మాయిగా బాగా నటించింది కానీ..ఆమె పాత్ర సడెన్ గా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఆమె తండ్రి నరేంద్రవర్మగా చేసిన నరేష్ ఎప్పటిలాగే తన నటనతో మెప్పించాడు. రానా వాయిస్ ఓవర్ కూడా ప్లస్ అయింది. సినిమా ప్రారంభం రానా వాయిస్ ఓవర్ తో ప్రారంభమై సినిమాకు ఓ గంభీరమైన లుక్ తెచ్చింది.

హారర్, థ్రిల్లర్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్‌చంద్ర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మరోసారి మార్క్ చూపించారు. ఆర్.కె.ప్రతాప్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్, లక్ష్మీసింధూ గ్రంధి కళా దర్శకత్వ బాధ్యతలు తెరపై కనిపిస్తున్నాయి.

ఈ సినిమాకు మరో బలం స్టోరీనే. డైరెక్టర్ చాలా మంచి కథనే ఎన్నుకున్నాడు.‘సుబ్రహ్మణ్యపురం’లో వరుస ఆత్మహత్యలు..వాటిని ఛేదించడం అనే కాన్సెప్ట్ ను తీసుకున్నాడు.. అయితే ఆ మిస్టరీని ఛేదించే విధానం దగ్గరే కాస్త తడబడినట్టు కనిపించినా..ఫైనల్ గా వచ్చే సరికి బాగానే ముగించాడు డైరెక్టర్.

ఓవరాల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సుబ్రహ్మణ్యపురం తప్పకుండా నచ్చుతుంది.

ప్లస్ పాయింట్స్ :

* సుమంత్ యాక్షన్
* బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌
* సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

* కమర్షియల్ ఎలిమెంట్స్
* అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలు
* క్యాస్టింగ్ వీక్

Subrahmanyapuram Telugu Movie Review
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here