స‌మంత కొత్త సినిమా విశేషాలు

Samantha New Movie Latest Updates,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Samantha New Movie Details,Samantha Akkineni Next Movie Latest Updates,#Samantha,Samantha Upcoming Movies News,Samantha Latest Movies Updates
Samantha New Movie Latest Updates

ఓ ప‌క్క వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటూనే… మ‌రో ప‌క్క తీరిక లేకుండా సినిమాల‌ను చేస్తోంది టాలెంటెడ్ బ్యూటీ స‌మంత. ఈ ఏడాది ‘రంగ‌స్థ‌లం’, ‘మ‌హాన‌టి’, ‘యుట‌ర్న్’ మూవీల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకుంది ఈ అమ్మ‌డు. ఈ మూడు చిత్రాల్లోనూ వైవిధ్యమైన పాత్ర‌ల్లో న‌టించి, మెప్పించిన సామ్… ప్ర‌స్తుతం నాగచైత‌న్య‌తో క‌లిసి ‘మ‌జిలీ’ చిత్రంలో న‌టిస్తోంది. ‘నిన్నుకోరి’ మూవీతో మంచి హిట్‌ను అందుకున్న డైరెక్ట‌ర్‌ శివ నిర్వాణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇదిలా ఉంటే… మ‌రోవైపు ఓ కొరియ‌న్ ఫిల్మ్ రీమేక్‌లో కూడా స‌మంత న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన కొరియ‌న్ ఫిల్మ్ ‘మిస్ గ్రానీ’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు లేడీ డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి. ఈ చిత్రంలో సామ్ ద్విపాత్రాభిన‌యం చేస్తోంది. అలాగే… యువ కథానాయ‌కుడు నాగశౌర్య ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లోని ర‌వీంద్ర‌భార‌తిలో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. వారం రోజులుగా జ‌రుగుతున్న ఈ షూటింగ్‌లో సామ్, నాగ‌శౌర్య పాల్గొంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, సునీత తాటి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని… వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here