నెక్స్ట్ ఏంటి తెలుగు మూవీ రివ్యూ

#NextEntiReview, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies 2018, Next Enti Movie Live Updates, Next Enti Movie Plus Points, Next Enti Movie Public Response, Next Enti Movie Review, Next Enti Movie Review and Rating, Next Enti Movie Story, Next Enti Movie Telugu Public Talk, Next Enti Review, Next Enti Telugu Movie Review, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Next Enti Telugu Movie Review

సందీప్ కిషన్, తమన్నా జంటగా నటించిన చిత్రం నెక్స్ట్ ఏంటి. బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకూ నచ్చిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ :

టామీ (తమన్నా) విలువలకు ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి. తను పుట్టినప్పుడే తల్లి మరణించడంతో చిన్నప్పటినుండి నాన్న(శరత్ బాబు) చేతుల్లో నే పెరుగుతుంది. ప్రేమ అంటే కేవలం ఫిజికల్ రిలేషన్ మాత్రమే కాదు.. అంతకు మించిన ఏదో ఫీలింగ్ అని నమ్ముతుంది. నిజమైన ప్రేమను కోరుకుంటుంది. అలాంటి టామీ లైఫ్ లోకి అనుకోకుండా సంజూ (సందీప్ కిషన్) వస్తాడు. ఈ ప్రయాణంలో సంజయ్ తో ప్రేమలో పడుతుంది. ఒకరిని ఒకరు బాగా ఇష్టపడతారు. ఇద్దరూ ఆరు నెలలు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తరువాత సంజయ్‌కి రోషిణి(లారిసా)తో పెద్దలు పెళ్లి కుదుర్చుతారు. మరోవైపు టామీకి పెళ్లయి విడాకులు తీసుకున్న వ్యక్తి క్రిష్(నవదీప్)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. మరి చివరికి ఎవరెవరు కలుస్తారు ? టామీ, సంజు కలుస్తారా ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

డైరెక్టర్ కునాల్ కోహ్లీ మంచి కథను ఎంచుకున్నాడు. అలాగే తన దర్శకత్వ పనితనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు. సందీప్ కిషన్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఫ్రెష్ గా, స్టైలిష్ గా కనిపించాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు.

ఇక ఈ సినిమాలో హీరో కంటే హీరోయిన్ దే ప్రధాన పాత్ర అని చెప్పొచ్చు. తమన్నా అటు నటనతో..ఇటు గ్లామర్ తోనూ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమన్నాను చాలా అందంగా చూపించారు. ముఖ్యంగా ఆమె డబ్బింగ్ కూడా బాగుంది. అలాగే ప్రేమ గురించి ఆమె చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. తమన్నా తండ్రి పాత్రలో నటించిన సీనియర్ నటుడు శరత్ బాబు ఎప్పటిలాగే తన నటనతో మెప్పిస్తారు. తమన్నాకు ఆయనకు మధ్యన సాగిన సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి.

ఇక నవదీప్, పూనమ్ కౌర్ తో సహా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సి మరో అంశం సంగీతం. లియోన్ జేమ్స్ అద్భుతమైన పాటలను అందించారు.

ప్లస్ పాయింట్స్

* తమన్నా
* సినిమాటోగ్రఫి
* సంగీతం

మైనస్ పాయింట్స్

* సెకండ్ హాఫ్

 

Next Enti Telugu Movie Review
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here