నాని, దుల్క‌ర్ కాంబినేష‌న్ లో మ‌ల్టీస్టార‌ర్?

Latest Telugu Movies 2018, Nani and Dulquer Salmaan Combination Movie, Nani and Dulquer Salmaan Multistarrer On Cards, Nani and Dulquer Salmaan to Act Together, Nani and Dulquer Salmaan Upcoming Multistarrer Film, Nani Dulquer Salmaan to Team Up for a Multistarrer Movie, Nani Next Movie Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Nani and Dulquer Salmaan Multistarrer On Cards

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు కింగ్ నాగార్జున‌తో క‌ల‌సి `దేవ‌దాస్` అనే మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేసిన నేచుర‌ల్ స్టార్ నాని… మ‌రో మ‌ల్టీస్టార‌ర్ లోనూ సంద‌డి చేయ‌బోతున్నార‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. నాని తొలి చిత్రం `అష్టా చ‌మ్మా`తో పాటు `జెంటిల్ మ‌న్` చిత్రాన్ని కూడా రూపొందించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుండ‌గా… మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే… ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో నానితో పాటు మ‌రో యువ క‌థానాయ‌కుడు న‌టించ‌నున్నాడ‌ని ఇప్ప‌టికే కొన్ని క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆ మ‌ధ్య‌… నిఖిల్ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది కూడా. తాజా స‌మాచారం ప్రకారం… నానితో న‌టించ‌బోయే ఆ యంగ్ హీరో నిఖిల్ కాద‌ని… మ‌ల‌యాళ క‌థానాయ‌కుడు దుల్క‌ర్ స‌ల్మాన్ అని తెలుస్తోంది. కేవ‌లం మ‌ల‌యాళ చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా… తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టించిన దుల్క‌ర్… `మ‌హాన‌టి`తో మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన సంగ‌తి తెలిసిందే.

మ‌రి… రెండు వేర్వేరు భాష‌ల్లో మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న నాని, దుల్క‌ర్ క‌ల‌సి న‌టిస్తే… ఆ సినిమాకు వ‌చ్చే క్రేజే వేరు. మ‌రి… ఈ కాంబినేష‌న్ వార్త‌ల‌పై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుందేమో చూడాలి. అన్న‌ట్టు… దుల్క‌ర్ న‌టించిన త‌మిళ అనువాద చిత్రం `ఓకే బంగారం` కోసం.. దుల్క‌ర్ కి నాని డ‌బ్బింగ్ చెప్పిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here