కవచం తెలుగు మూవీ రివ్యూ

#KavachamReview, Kavacham Movie Live Updates, Kavacham Movie Plus Points, Kavacham Movie Public Response, Kavacham Movie Review, Kavacham Movie Review and Rating, Kavacham Movie Story, Kavacham Review, Kavacham Telugu Movie Pubilc Talk, Kavacham Telugu Movie Review, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies 2018, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Kavacham Telugu Movie Review

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటి వరకూ భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈసారి మాత్రం కాస్త తక్కువ బడ్జెట్ లో శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో ‘కవచం’ అనే సినిమా తెరకెక్కింది. స్టార్ హీరోయిన్ కాజల్, మెహ్రీన్ జంటగా నటించిన కాజల్ హీరోయిన్ గా మెహ్రీన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో.. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక సాయి శ్రీనివాస్ కూడా ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి ఆ అంచనాలను సాయి శ్రీనివాస్ అందుకున్నాడా..? సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

నటీనటులు – బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్,మెహ్రీన్, నీల్ నితిన్ ముకేశ్, హర్షవర్ధన్ రాణే, పోసాని కృష్ణ మురళి
దర్శకత్వం – శ్రీనివాస్ మామిళ్ల
బ్యానర్ – వంశధార క్రియేషన్స్
సంగీతం – థమన్
నిర్మాత– నవీన్ శొంఠినేని

కథ:

విజయ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అయితే తాను కాఫీ షాప్ లో వెయిటర్ గా పనిచేస్తున్న సంయుక్త (కాజల్) తో ప్రేమలో పడతాడు. అయితే సంయుక్తకు ఎంగేజ్ మెంట్ అయిందని..వెళ్లిపోయిందని సంయుక్త స్నేహితురాలు.. విజయ్ కు చెపుతుంది. ఇదిలా ఉండగా ఓ కిడ్నాప్ కేసులో లావణ్యను (మెహ్రీన్) విజయ్ కాపాడతాడు. అనుకోని పరిస్థితుల్లో కిడ్నాప్ కు కారణం విజయే అని అతనిపై నిందలు మోపుతారు. దీంతో విజయ్ అసలు ఈ కిడ్నప్ వెనుక ఉన్నది ఎవరు? తనను ఎందుకు దీనిలో ఇరికించారు..? అసలు సంయుక్త, లావణ్య ఎవరు? విజయ్ ఈ కేసును తాను ఒక్కడే ఎలా ఛేదించాడు..? తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ఇది ఐదో చిత్రం కాగా.. తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో దర్శనం ఇచ్చారు. పోలీస్ ఆఫీసర్ గా బెల్లంకొండ శ్రీనివాస్ పెర్ఫామెన్స్ సూపర్ అని చెప్పొచ్చు. నటనలో పరణతి చెందాడు. ఇక కాజల్‌, మెహ్రీన్‌ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా విలన్ పాత్రలో నటించిన నీల్ నితిన్ ఆ పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యాడనిపిస్తుంది. తన నటనతో మంచి మార్కులే కొట్టేశాడు. ఇక మిగిలిన వారు వారి వారి పాత్రల మేరకు బాగానే నటించారు.

మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ల గురించి. తనకిది ఫస్ట్ సినిమానే అయినా ఎక్కడా అలాంటి లోపం కనిపించలేదు. మేకింగ్ స్టాండర్డ్స్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాకు మరో హైలెట్ థమన్ సంగీతం. వరుస మ్యూజికల్ హిట్స్‌తో దూసుకుపోతున్న తమన్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ అందించాడు.

ఇక ఫస్ట్ హాఫ్ లో మంచి ట్విస్ట్ లు, లవ్ స్టోరీతో నడిచిన కవచం.. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయిందని చెప్పొచ్చు. కానీ క్లైమాక్స్ కు వచ్చే సరిగి మాత్రం డైరెక్టర్ చాలా బ్యాలెన్డ్స్ గా ఫినిష్ చేశాడు. ఫైనల్ గా చెప్పాలంటే కవచం అందరూ మెచ్చే కమర్షియల్ ఎంటర్ టైనర్..

ప్లస్ పాయింట్స్:

* నటీనటుల నటన
* మేకింగ్
* సంగీతం

మైనస్ పాయింట్స్:

* సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా ల్యాగ్

 

 

Kavacham Telugu Movie Review
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3.5
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here