ఇంట‌రెస్టింగ్ టైటిల్ తో వ‌స్తున్న సాయి శ్రీ‌నివాస్

Bellamkonda Sreenivas About His Next Project Title, Bellamkonda Sreenivas Gets an Interesting for His Next, Bellamkonda Sreenivas New Movie Latest News, Bellamkonda Sreenivas Next Movie Title, Bellamkonda Sreenivas Next Movie Updates, Bellamkonda Sreenivas Upcoming Movies Details, Latest Telugu Movies 2018, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Bellamkonda Sreenivas Gets an Interesting for His Next

`క‌వ‌చం`తో ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్ళ రూపొందించిన ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ‌రీన్ క‌థానాయిక‌లుగా న‌టించారు. `భ‌య‌ప‌డే వాడికి, భ‌య‌పెట్టేవాడికి మ‌ధ్య క‌వ‌చంలా ఒక‌డుంటాడు రా… వాడే పోలీస్` అంటూ ఓ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ గా క‌నిపించ‌బోతున్నారు సాయి శ్రీ‌నివాస్.

ఇదిలా ఉంటే… ఈ సినిమా విడుద‌లైన మూడు నెల‌ల‌లోపే మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన సినిమాతో అభిమానుల మందుకు రాబోతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తేజ రూపొందిస్తున్న ఈ చిత్రంలోనూ సాయి శ్రీనివాస్ కు జోడీగా కాజ‌ల్ న‌టిస్తుండ‌డం విశేషం. అలాగే గ్లామ‌ర్ హీరోయిన్ మ‌న్నారా చోప్రా మ‌రో నాయిక‌గా క‌నిపించ‌నుంది. ఈ సినిమాకి టైటిల్ గా `సీత‌` ప‌రిశీల‌న‌లో ఉంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ స‌మాచారం. ఇందులో క‌థానాయిక కాజ‌ల్ పాత్ర పేరు సీత అని… ఆమె పాత్ర చుట్టే క‌థ న‌డుస్తుంద‌ని… అందుకే టైటిల్ కూడా ఆ పాత్ర పేరుని ఆలోచిస్తున్నార‌ని ఇన్ సైడ్ సోర్స్ టాక్. ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి నెల‌లో తెర‌పైకి రానున్న ఈ సినిమాతో… బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ – కాజ‌ల్ – తేజ త్ర‌యం మంచి విజ‌యాన్ని నమోదు చేసుకుంటుందేమో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here