ఈసారి కూడా వెంకీ విజ‌యం సాధిస్తారా?

F2 Movie Latest News, Latest Telugu Movies 2018, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Venkatesh Get Success with F2, Venkatesh Movies Details, venkatest F2 Movie Latest Updates, Will Venkatesh Get Success with F2, Will Venkatesh Get Success with Fun and Frustration
Will Venkatesh Get Success with F2

సంక్రాంతి పండుగ అంటే తెలుగువారికి ఎంతో ప్ర‌త్యేకం. ఆ ప్ర‌త్యేకమైన పండుగ రోజు తాము సంక్రాంతి హీరోల‌నిపించుకోవాల‌ని టాలీవుడ్ హీరోలు ఆశ‌ప‌డుతూ ఉంటారు. అయితే అందులో విజ‌యం సాధించిన‌వారు మాత్రం కొంత‌మందే ఉంటారు. ఆ కొంత‌మందిలో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక‌రు. సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన వెంకీ చిత్రాల్లో ‘చంటి'(1992), ‘క‌లిసుందాం..రా'(2000), ‘ల‌క్ష్మి'(2006) లాంటి సూప‌ర్ హిట్ మూవీస్ ఉన్నాయి. ఇవ‌న్నీ వెంక‌టేష్ సోలో హీరోగా న‌టించ‌గా విజ‌యం సాధించిన చిత్రాలు. వీటితో పాటు వెంక‌టేష్, మ‌హేష్ బాబు హీరోలుగా న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు'(2013) కూడా సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అంతేగాకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి న‌టించిన మ‌రో మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘గోపాల గోపాల'(2015) కూడా సంక్రాంతి విజ‌యాన్ని రుచి చూపించింది. ఇప్పుడు 2019 సంక్రాంతికి మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకోవ‌డానికి సిధ్ధంగా ఉన్నారు వెంక‌టేష్.

ఆ వివ‌రాల్లోకి వెళితే… వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం ‘ఎఫ్‌-2: ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌’. ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాల‌ను స‌మ‌కూరుస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి ఇప్ప‌టికే రెండు మ‌ల్టీస్టారర్ మూవీస్‌తో సంక్రాంతికి విజ‌యాల‌ను సొంతం చేసుకున్న వెంకీ… ఈ చిత్రంతో మూడో మ‌ల్టీస్టారర్ మూవీ విజ‌యాన్ని కూడా అందుకుని హ్యాట్రిక్ కొడ‌తారేమో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here