హావ భావ సంపదలో సాటిలేని సావిత్రి

Unmatchable Qualities of Mahanati Savitri,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Qualities that Made Savitri a Mahanati,Mahanati Savitri Latest Updates,Actress Savitri Birth Anniversary,Mahanati Savitri Birth Anniversary
Unmatchable Qualities of Mahanati Savitri

“తెలుగు- తమిళం”- ఇవి రెండూ రెండు విభిన్న భాషలు.. రెండు విభిన్న సంస్కృతులు. ఏ భాష నటీనటులు ఆ భాషలో విజయాలు సాధిస్తూ ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. కానీ ఈ రెండు భాషా చిత్రాలలోనూ సమ స్థాయిని, సమ ప్రాధాన్యతను, సమ ప్రాచుర్యాన్ని సాధించి రెండు రంగాల ఆరాధ్య నటిగా ఎదిగిన మొట్టమొదటి నటీమణి మహానటి సావిత్రి అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.

1950-60 దశకాలలో తెలుగు తమిళ రంగాలలో సావిత్రి నటజీవిత వైభవాన్ని గురించి ఏమి చెప్పినా, ఎంత చెప్పినా అది చర్విత చర్వణమే అవుతుంది. రెండు రంగాల అగ్రనటులైన ఎన్టీ రామారావు- అక్కినేని నాగేశ్వరరావు,ఎం. జీ. రామచంద్రన్- శివాజీ గణేషన్ లు సావిత్రి డేట్స్ కోసం ఎదురుచూసిన సందర్భాలు ఎన్నెన్నో. అలా రెండు రంగాలలో అగ్రశ్రేణి, ఆరాధ్య నటిగా వెలిగిన సావిత్రి జయంతి ఈ రోజు.

1935 డిసెంబర్ 6వ తేదీన గుంటూరు జిల్లా ‘చిర్రావూరు’ లో జన్మించిన సావిత్రి 1981 డిసెంబర్ 26న తనువు చాలించారు. జయంతి వర్ధంతి ఒకే నెలలో రావటం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఆమె జన్మదిన సమాచారంలో ఒక తప్పు దొర్లుతుంది. ఈ రోజున ఎవరికి ఏ సమాచారం కావాలన్నా అందరూ “గూగుల్” సెర్చ్ లోకి వెళ్ళటం జరుగుతుంది. చాలా వరకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించే గూగుల్ సావిత్రి డేట్ అఫ్ బర్త్ ను జనవరి 4- 1933 గా ఒక చోట, 1936 గా ఒక చోట ఇవ్వడం జరిగింది. కానీ మున్సిపల్ రికార్డులలోని సాధికారిక సమాచారం ప్రకారం సావిత్రి జన్మదినం ” డిసెంబర్ 6- 1935 గా నమోదు అయినందున గూగుల్ తెలుగు అథారిటీస్ గమనించగలరని ఆశిద్దాం.

ఇక మహానటి సావిత్రి నట జీవిత విశేషాల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. ఆమె నట,నిజ జీవితాలలోని అన్ని విషయాలు, విజయ విశేషాలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితాలే అయిన కారణంగా వ్యాస రూపంలో కాకుండా ఆ మహా నటి జయంతి సందర్భంగా “తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” ఒక చిన్న అక్షర నీరాజనాన్ని సమర్పిస్తుంది.

వెండితెర వేలుపుగా
వెలిగినట్టి ద్రువతార
వేల వేల మనసుల్లో
స్థిర నివాసి ఆ సితార
హావ భావ సంపదలో
లేరెవ్వరు తనకు సాటి
అత్యుత్తమ ప్రమాణాల
అభినయాన మేటి

కంటి చూపు ఒకటి చాలు
కొంటె నవ్వె వేల వేలు
పెదవి విరుపు నొసటి మెరుపు
అణువణువున అభినయమే
హావభావ రసమయమే
తరతరాలు చెప్పుకునే
నట వైభవ చిహ్నం
తెలుగువాడి చేజారిన
వెల తెలియని వజ్రం
సావిత్రి స్మృతులన్నీ
ప్రతి యెదలో పదిలం
సినీ జగతి చరిత లోన
స్వర్ణాక్షర లిఖితం

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here