బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు పెట్టేసుకున్నారు అభిమానులు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమాలో యాక్షన్ సన్నివేశాలు భారీగానే ఉంటాయని ఎప్పుడో అర్ధమైపోయింది.
ఇప్పటికే ఈ సినిమాలో కీలక సన్నివేశమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం రూ.35 కోట్లు ఖర్చు చేసినట్టు గతంలో దర్శకుడు సుజీత్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈసినిమా గురించి మరో అప్ డేట్ ఇచ్చాడు సుజిత్. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా భారీ యాక్షన్ ఎపిసోడ్ పూర్తయినట్టు సుజీత్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను వచ్చే ఏడాది ద్వితియార్థంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈసినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తుండగా..మాదీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
