దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మొదటి షెడ్యూల్లో భాగంగా ఎన్టీఆర్, చెర్రీలపై కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించాడు రాజమౌళి. అయితే ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని జక్కన్నే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని తెలిపి.. రేపు జరగబోయే ఎన్నికల గురించి కూడా ప్రస్తావించాడు. ఫస్ట్ షెడ్యూల్ ఫూర్తయింది..ఇప్పుడు ఓటు వేసే టైమ్.. మీ అందరూ ఓటు వేయడానికి సిద్దంగా ఉన్నారా? అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.
Done with the first schedule of #RRR. Now it’s time to cast my vote!
Are you ready to cast your’s?Dear Telanganaites, take pride in building our future.. Vote tomorrow…
— rajamouli ss (@ssrajamouli) December 6, 2018
మరి అప్పుడే రాజమౌళి ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తిచేశాడంటే ..ఈ రేంజ్ లో..ఇంత ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేస్తే వచ్చే ఏడాదే సినిమా రిలీజ్ చేసేయొచ్చు. మరి చూద్దాం..ఏం జరుగుతుందో. ఇక ఈ నెల 12 న కూడా ఏదో సర్ ప్రైజ్ ఉందని వార్తలయితే వస్తున్నాయి. మరి అందులో ఎంత నిజముందో ఆ రోజే తెలుస్తుంది. కాగా ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
