భారీ అంచనాల మధ్య నవంబర్ 29న రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతుంది. సుమారు పదివేలకి పైగా స్క్రీన్స్ లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ప్రస్తుతం పెద్దగా సినిమాలు కూడా లేకపోవడం 2.0కు బాగా కలిసొచ్చింది. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ వారం రోజుల్లో మంచి కలెక్షన్స్ రాబట్టుకున్న ఈ సినిమా తాజాగా మరో మైల్ స్టోన్ ను దాటింది. 500 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఎనిమిది రోజులకి ఈ మూవీ రూ.500 కోట్లు సాధించినట్టు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పోస్టర్ ద్వారా తెలియజేసింది.

2.0 ఏపీ-తెలంగాణ టోటల్ 7డేస్ షేర్ – 40.02 కోట్లు
* నైజాం – 17.00 కోట్లు
* సీడెడ్ – 6.25 కోట్లు
* నెల్లూరు – 1.56 కోట్లు
* గుంటూరు – 2.90 కోట్లు
* కృష్ణ – 2.34 కోట్లు
* వెస్ట్ – 2.04 కోట్లు
* ఈస్ట్ – 2.92 కోట్లు
* యూఏ – 5.01 కోట్లు
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
[youtube_video videoid=e2xWl7HJARg]