రూట్ మార్చిన టాలెంటెడ్ బ్యూటీ

Actress Mehreen Latest Movies Updates, Actress Mehreen Start Second Heroine Roles, Latest Telugu Movies 2018, Mehreen Agree to do Second Heroine Roles, Mehreen Starts Accepting Second Heroine Roles, Mehreen Upcoming Movies Details, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Mehreen Starts Accepting Second Heroine Roles

2016లో విడుద‌లైన ‘కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌’ చిత్రంతో క‌థానాయిక‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచ‌య‌మైంది పంజాబీ ముద్దుగుమ్మ మెహ‌రీన్. తొలి చిత్రంతోనే మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ఈ భామ‌… ఆ త‌ర్వాత ‘మ‌హానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకుని హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ త‌ర్వాత వ‌చ్చిన ‘కేరాఫ్ సూర్య, ‘జ‌వాన్‌’, ‘పంతం’, ‘నోటా’ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోయినా న‌టిగా మంచి మార్కులు ద‌క్కాయి. ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ ‘క‌వ‌చం‘ చిత్రంతో పాటు… విక్ట‌రీ వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘ఎఫ్‌-2’లో కూడా నాయిక‌గా న‌టిస్తోంది మెహ‌రీన్.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌మేమిటంటే… ఇంతవ‌ర‌కు తెలుగులో సోలో హీరోయిన్‌గానే సినిమాలు చేస్తూ వ‌చ్చిన మెహ‌రీన్ ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో కూడా ఎక్స్‌పీరియ‌న్స్ హీరోయిన్స్‌తో క‌లిసి న‌టిస్తుండ‌డం విశేషం. రేపు (07.12.2018) విడుద‌ల కానున్న ‘క‌వ‌చం’ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో తెర‌ను పంచుకోగా… 2019 సంక్రాంతికి విడుద‌ల కానున్న ‘ఎఫ్‌-2’లో త‌మ‌న్నాతో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకుంది మెహ‌రీన్. అగ్ర క‌థానాయిక‌లతో క‌లిసి న‌టిస్తున్న ఈ రెండు చిత్రాల‌తో… మెహ‌రీన్ మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి రావాల‌ని ఆశిద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here