మ‌రో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కీర్తి సురేష్

Actress Keerthy Suresh New Movie Updates, Actress Keerthy Suresh Next in Female Oriented Film, Keerthy Suresh Coming Up With Another Female Oriented Film, Keerthy Suresh Next Project Details, Keerthy Suresh to do Lady Oriented Film, Keerthy Suresh Upcoming Movies Updates, Latest Telugu Movies 2018, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Keerthy Suresh Coming Up With Another Female Oriented Film

‘నేను శైల‌జ’తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కేర‌ళ కుట్టి కీర్తి సురేష్. తొలి చిత్రంతోనే విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ఈ భామ… ఆ త‌ర్వాత నానితో జంట‌గా న‌టించిన‌ ‘నేను లోకల్ తో మ‌రో విజ‌యాన్ని అందుకుంది. అయితే ఈ ఏడాది ఆరంభంలో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘అజ్ఞాత‌వాసి’ మాత్రం కీర్తికి హ్యాట్రిక్ హిట్‌ను ఇవ్వ‌లేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో.. ఈ ఏడాది మే 9న విడుద‌లైన ‘మ‌హాన‌టి’ ఆమె కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసింది. అల‌నాటి మేటి న‌టి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో కీర్తి న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు ముగ్థులైపోయారు. సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి సురేష్‌కి ఆ త‌ర్వాత తెలుగులో అవ‌కాశాలు వెల్లువ‌లా వ‌చ్చాయి. కాని ‘మ‌హాన‌టి’ తీసుకువ‌చ్చిన ప్ర‌త్యేక గుర్తింపుతో… కెరీర్‌ను జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాల‌నే ఉద్దేశంతో.. మంచి క‌థ కోసం వేచి చూస్తూ వ‌చ్చింది కీర్తి.

ఈ క్ర‌మంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన‌ క‌థ‌కు తాజాగా కీర్తి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా సాగే చిత్రం కావ‌డం… అలాగే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ కావడంతో… కీర్తి ఆ క‌థ‌తో సినిమా చేయ‌డానికి అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మ‌హేశ్ కోనేరు ఈ సినిమాను నిర్మించ‌నున్నార‌ని.. ఈ చిత్రంతో ఓ ప్ర‌ముఖ‌ ర‌చ‌యిత డైరెక్ట‌ర్‌గా మెగాఫోన్ ప‌ట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లో లాంచ్ కాబోతున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మ‌రిన్ని విష‌యాలు వెల్ల‌డి కావ‌ల‌సి ఉంది. ఏదేమైనా… కీర్తి అభిమానుల‌ను ఇది ఆనందాన్నిచ్చే విష‌య‌మే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here