ఒక్క సాంగ్ మినహా షూటింగ్ కంప్లీట్ అయిన F2

F2 to Finish Complete Shoot with Final Song,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,F2 Movie Latest Updates,F2 Movie Shooting Completed,#F2,Fun and Frustration Movie Shooting Completed,F2 Movie to Finish Complete Shoot,#F2Shoot
F2 to Finish Complete Shoot with Final Song

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న మల్టీ స్టారర్ F2 ఫన్ &ఫ్రస్టేషన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ రోజు నుండి F2 మూవీ కి సంబంధించిన అప్ డేట్స్ వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపిన విషయం తెలిసిందే. తమన్నా,మెహరీన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ F2 మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

F2 మూవీ ఒక సాంగ్ మినహా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నట్టుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందిన సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలు ఘన విజయం సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ సినిమా F2 టీజర్ విక్టరీ వెంకటేష్ బర్త్ డే రోజు డిసెంబర్ 12వ తేదీ రిలీజ్ కానుంది. F2 మూవీ సాంగ్స్ ను ఒక్కొక్కటిగా ఒక వారంలో రిలీజ్ చేస్తారని సమాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here