బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ ఫిలింకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Bellamkonda Sreenivas Gets An Interesting Title For Next Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Bellamkonda Sreenivas Next Film Gets an Interesting Title,Bellamkonda Sreenivas Next Movie Title,Bellamkonda Sreenivas Upcoming Movies Updates,Bellamkonda Sreenivas New Movie Details,Bellamkonda Sreenivas Next Film Title
Bellamkonda Sreenivas Gets An Interesting Title For Next Movie

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, సీనియర్‌ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన కవచం సినిమా… ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇదిలా ఉండగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ కలిసి మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా ఈ జంటే నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. సీత అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ముఖ్యంగా సీత పాత్ర చేస్తున్న కాజల్ చుట్టూ తిరుగుందట..అందుకే ఆ పేరునే టైటిల్ గా పెట్టారట. అయితే అధికారింగా ప్రకటించాల్సి ఉంది.

కాగా ఈ సినిమాలో మన్నారా చోప్రా కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here