శ్రీదేవి నటించిన ఆఖరి చిత్రం

Actress Sridevi Last Film, Latest Telugu Movies 2018, Sri Devi Last Movie Appearance in Zero, Sri Devi Last With Shah Rukh Khan Film Zero, Sridevi Last Film Will be Shah Rukh Khan Zero, Sridevi Makes a Cameo Appearance, Sridevi Makes a Cameo Appearance in Zero, Sridevi Surprise With Cameo, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Actress Sridevi Last Film

4సంవత్సరాల వయసులో బాలనటి గా చిత్రసీమలో ప్రవేశించిన శ్రీదేవి అనతి కాలం లోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో అగ్ర తారగా వెలుగొందారు. లెజండరీ యాక్ట్రెస్, అతిలోక సుందరి శ్రీదేవి 1983 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ హిమ్మత్ వాలా సినిమాతో బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా పేరుపొందారు. ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ శ్రీదేవి నటించిన ఆఖరి చిత్రం జీరో. ఈ సినిమాలో శ్రీదేవి అతిధి పాత్రలో నటించారు.

గౌరీ ఖాన్ నిర్మాణ సారధ్యంలో రెడ్ చిల్లీస్, కలర్ యెల్లో ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన జీరో సినిమా డిసెంబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. జీరోహిందీ మూవీ లో అనుష్క శర్మ, కత్రినా కైఫ్, మాధవన్, అభయ్ డియోల్ ముఖ్య పాత్రలలో నటించగా, శ్రీదేవి, కాజోల్, రాణి ముఖర్జీ, అలియా భట్, కరిష్మా కపూర్, దీపికా పడుకొనే, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలలో నటించారు. సుమారు 300 సినిమాలలో నటించిన శ్రీదేవి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here