ఎన్టీఆర్ బయోపిక్ – పదిమందికి పైగా కథానాయికల హంగామా

విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బయోపిక్ లో తన తండ్రి పాత్రలో బాలకృష్ణ అలరించనున్నాడు. రెండు పార్ట్ లుగా తెరకెక్కుతున్న ఈసినిమాకు ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’, ‘యన్.టి.ఆర్- మహానాయకుడు’ అని టైటిల్స్ ఫిక్స్ చేసేసి జనవరి 9న ఒక పార్ట్, జనవరి 24న మరో పార్ట్ ను రిలీజ్ చేయనున్నారు.

మొద‌టి పార్ట్ లో ఎన్టీఆర్ బాల్యం, విద్యా బ్యాసం గురించి ప్ర‌స్తావించ‌నుండ‌గా రెండో పార్ట్‌లో ఎన్టీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానానికి సంబంధించిన విష‌యాలు చూపించ‌నున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పలువురి లుక్స్ ను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా క్రిష్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కు తగ్గట్టు వారిని ఎంపిక చేసుకొని.. నటులను ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ప్రతి ఒక్క పాత్రను చూస్తుంటే.

ఇక షూటింగ్ మొదలైన దగ్గర నుండి ఈ రోజు వరకూ ఎవరో ఒకరి పేరు బయటకు వస్తూనే ఉంది. పలానా పాత్రలో పలానా నటి నటిస్తుందని ఇప్పటికే ఎందరో పేర్లు బయటకి వచ్చాయి. అలా ఇప్పటివరకూ దాదాపు పదిమందికి పైగా కథానాయికల పేర్లు వినిపించాయి. వీరందరూ ఎన్టీఆర్ బయోపిక్ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్నారు. మరి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ పక్కన చిందేసే హీరోయిన్ల లిస్ట్ ఒకసారి చూద్దామా..

విద్యాబాలన్ – ఎన్టీఆర్ శ్రీమతి బసవతారకంగా

నిత్యామీనన్- సావిత్రి పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా రిలీజవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

రకుల్ ప్రీత్ సింగ్ – శ్రీదేవి పాత్రలో నటిస్తుంది. రకుల్ ఫస్ట్ లుక్ కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు

హన్సిక – జయప్రద పాత్రలో

పాయల్ రాజ్ పుత్ – జయసుధ పాత్రలో

షాలినీ పాండే – షావుకారి జానకి పాత్రలో

మంజిమామోహన్ – నారా భువనేశ్వరి

మాళవిక నాయర్ – కృష్ణకుమారి పాత్రలో

ఈషా రెబ్బా – అతిధి పాత్రలో

పూనమ్ బజ్వా – గారపాటి లోకేశ్వరి

 

ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ బయోపిక్ లో వీరు నటిస్తున్నారు. మరి ముందు ముందు ఇంకెంత మంది కథానాయికల పేర్లు తెరపైకి వస్తాయో.. వీరితోనే క్రిష్ స్టాప్ చేస్తాడో?లేదో? చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here