సాయిప‌ల్ల‌వి మ‌ళ్ళీ మ్యాజిక్ చేస్తుందా?

Sai Pallavi to Repeat December 21 Sentiment,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Sai Pallavi Repeat the Music Sentiment,Actress Sai Pallavi Latest Updates,Sai Pallavi to Repeat December 21 Music Sentiment,Sai Pallavi Upcoming Movies Details,Heroine Sai Pallavi to Repeat the Music Sentiment
Sai Pallavi to Repeat December 21 Sentiment

‘ఫిదా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ‌ సాయిప‌ల్ల‌వి. త‌ర్వాత నానితో కలిసి న‌టించిన ‘ఎం.సి.ఎ.’తో మ‌రో ఘ‌న విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా గ‌త ఏడాది డిసెంబ‌ర్ 21న విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ రెండు చిత్రాల్లో సాయిప‌ల్ల‌వి న‌ట‌నకి ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. ఇక ఈ ఏడాది విడుద‌లైన ‘క‌ణం’ ఆశించిన మేర మెప్పించ‌లేక‌పోయినా.. సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌కు మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి. ఇదిలా ఉంటే.. గ‌త ఏడాది ‘ఎం.సి.ఎ.’ విడుద‌ల తేదీని టార్గెట్ చేస్తూ.. సాయిప‌ల్ల‌వి న‌టించిన రెండు సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే.. యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌తో క‌లిసి సాయిప‌ల్ల‌వి న‌టించిన ‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’ సినిమా ఈ నెల 21న విడుద‌ల కానుంది.

ఈ సినిమాకి హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాల‌తో, పాట‌ల‌తో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. మ‌రోవైపు త‌మిళ హీరో ధ‌నుష్ స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన ‘మారి-2’ కూడా ఇదే రోజున విడుద‌ల కానుంది. 2015లో వ‌చ్చిన ‘మారి’కి సీక్వెల్‌గా ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ తెర‌కెక్కింది. ధ‌నుష్ సొంత నిర్మాణ సంస్థ వండ‌ర్ బేర్ ఫిల్మ్స్ ప‌తాకంపై నిర్మించిన ఈ చిత్రానికి బాలాజీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌రి డిసెంబ‌ర్ 21, 2017 నాటి మ్యాజిక్‌ను సాయిప‌ల్ల‌వి ఈ ఏడాది కూడా రిపీట్ చేస్తుందో? లేదో? చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here