2019లో న‌య‌న్ ట్రిపుల్ ఛీర్స్

Actress Nayanthara Latest Films in 2019, Actress Nayanthara Movies Latest Updates, Latest Telugu Movies 2018, Nayanthara Coming Up With 3 Movies in 2019, Nayanthara Movies in 2019, Nayanthara Upcoming Movies in 2019, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Nayanthara Coming Up With 3 Movies in 2019

న‌య‌న‌తార‌… పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తున్న ఈ జ‌న‌రేష‌న్ హీరోయిన్. ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ న‌టిగా త‌న‌దైన ముద్ర వేసిన ఈ కేర‌ళ‌కుట్టి… ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే… గ‌త కొంత‌కాలంగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో బిజీగా ఉన్న న‌య‌న్… వ‌చ్చే ఏడాది ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల‌కి జోడీగా క‌నువిందు చేయ‌బోతోంది. కోలీవుడ్ స్టార్ అజిత్ కి జోడీగా న‌య‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం `విశ్వాస‌మ్` సంక్రాంతికి రానుండ‌గా… మ‌రో త‌మిళ స్టార్ విజ‌య్ కి జోడీగా న‌టిస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని సినిమా దీపావ‌ళికి తెర‌పైకి రానుంది. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవికి జంట‌గా తొలిసారిగా న‌టిస్తున్న `సైరా న‌ర‌సింహారెడ్డి` కూడా వ‌చ్చే ఏడాదిలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సో… 2019లో ముచ్చ‌ట‌గా మూడు బిగ్ టికెట్ ఫిల్మ్స్ తో న‌య‌న్ ట్రిపుల్ ఛీర్స్ చెప్ప‌నుంద‌న్న‌మాట‌. గ‌త రెండేళ్ళుగా న‌య‌న్ న‌టించిన సినిమాల‌ను ప‌రిశీలిస్తే… బాల‌కృష్ణ‌తో జోడీ క‌ట్టిన `జై సింహా` మిన‌హా మ‌రో పెద్ద హీరో సినిమా లేదు. ఈ నేప‌థ్యంలో… ఈ మూడు చిత్రాలు న‌య‌న్ కి ఎంతో ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. మ‌రి.. ఈ ప్రాజెక్ట్స్ ఈ ముద్దుగుమ్మ‌కి మంచి విజ‌యాల‌ను అందిస్తాయేమో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here