2019… నాగ్ ఫ్యాన్స్ కు పండ‌గే

Akkineni Nagarjuna Movies in 2019, Latest Telugu Movies 2018, Nagarjuna Fans to Have a Fruitful 2019, Nagarjuna Movies Latest News, Nagarjuna Movies Latest Updates, Nagarjuna Upcoming Movies in 2019, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Nagarjuna Fans to Have a Fruitful 2019

ఓ ప‌క్క ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ చేస్తూనే.. మ‌రో ప‌క్క ప్ర‌యోగాత్మక చిత్రాల‌తోనూ ఆక‌ట్టుకుంటున్న సీనియ‌ర్ క‌థానాయ‌కుడు నాగార్జున‌. ఈ ఏడాది ‘ఆఫీస‌ర్’, ‘దేవ‌దాస్’ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. కాగా.. ప్ర‌స్తుతం నాగ్ రెండు మ‌ల్టీస్టారర్ మూవీస్‌లో న‌టిస్తున్న‌ విష‌యం తెలిసిందే. ఈ రెండూ కూడా తెలుగేత‌ర చిత్రాలు కావ‌డం విశేషం. ఆ వివ‌రాల్లోకి వెళితే.. బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న హిందీ చిత్రం ‘బ్ర‌హ్మాస్త్ర’లో నాగార్జున ఓ కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. అయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌ణ‌బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. మ‌రోవైపు ధ‌నుష్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న‌ ఓ త‌మిళ పిరియాడిక్ మూవీలో కూడా నాగ్ న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా వ‌చ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుద‌ల కానున్నాయి. అలాగే.. ‘చి.ల‌.సౌ.’మూవీతో ద‌ర్శ‌కుడిగా ఆక‌ట్టుకున్న రాహుల్ ర‌విచంద్ర‌న్ తెర‌కెక్కించ‌నున్న ‘మ‌న్మ‌థుడు-2’లో కూడా నాగార్జున న‌టించ‌బోతున్నారు. 2002లో విడుద‌లైన ‘మ‌న్మ‌థుడు’ చిత్రానికి కొన‌సాగింపుగా ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే నాగార్జునకు స్క్రిప్ట్‌ను వినిపించ‌డం కూడా జ‌రిగింద‌ని స‌మాచారం.

జ‌న‌వ‌రిలో ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంద‌ని టాలీవుడ్ టాక్. అంతేకాదు.. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకోబోతున్న ‘బంగార్రాజు’ సినిమాలో కూడా నాగ్ న‌టించ‌నున్న‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. 2016లో విడుద‌లైన ‘సోగ్గాడే చిన్ని నాయ‌న’కి సీక్వెల్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు ద‌ర్శ‌కుడు. ఈ రెండు సీక్వెల్స్ కూడా వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధంలో సెట్స్ పైకి వెళ్ల‌నున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 2019లో రెండు మ‌ల్టీస్టార‌ర్ మూవీస్‌ విడుద‌ల కానుండ‌డం.. మ‌రోపక్క రెండు సీక్వెల్స్‌తో నాగార్జున బిజీగా ఉండ‌డం.. నాగ్ ఫ్యాన్స్‌కు పండ‌గ‌నే చెప్పాలి. మ‌రి ఈ చిత్రాల‌తో టాలీవుడ్ మ‌న్మ‌థుడు ఎటువంటి విజ‌యాల‌ను న‌మోదు చేస్తారో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here