మారి2 ట్రైలర్ రిలీజ్ – అదరగొడుతున్న నాటీ డాన్

Maari 2 Trailer Out Now,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Maari 2 Trailer,Maari 2 Telugu Movie Trailer,Maari 2 Movie Trailer,Maari 2 Official Trailer,Maari 2 Theatrical Trailer,Dhanush Maari 2 Movie Trailer,Maari 2 Movie Latest News,#Maari2Trailer
Maari 2 Trailer Out Now

ధనుష్ హీరోగా గతంలో వచ్చిన మారి అప్పట్లో ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ మారి 2 తో నాటీ డాన్ గా మరోసారి సందడి చేయడానికి వస్తున్నాడు ధనుష్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈనెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

‘చావు అంటే భయపడని వాడిని చంపడం కాలా కష్టం.’ అంటూ మొదలైన ఈ ట్రైలర్లో ధనుష్ నాటీ డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. మాస్ రాజాగా ధనుశ్ డిఫరెంట్ లుక్ తో .. స్టైల్ తో కనిపిస్తున్న ఈ ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతుందనే చెప్పాలి. ‘మారి’ మాదిరిగానే ‘మారి 2’ కూడా మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఆటోడ్రైవర్ పాత్రలో సాయి పల్లవి ఓ రేంజ్ లో మాస్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతోందని ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతోంది. మరో నటి వరలక్ష్మి కీలకమైన పాత్రలో నటిస్తోంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ స్వయంగా నిర్మిస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here