హిల్ స్టేషన్ అరకు లో స్కూల్ నిర్మించిన కాజల్

Kajal Builds a School For Kids at Hill Station, Kajal Builds School at Araku Hill Station, Kajal Latest News, Kajal Latest Updates, Kajal Owns a School For Kids at Araku Hill Station, Latest Telugu Movies 2018, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Kajal Builds School at Araku Hill Station

విశాఖపట్నం జిల్లాలోని అరకు ఒక అందమయిన హిల్ స్టేషన్. ప్రకృతి సౌందర్యా లతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఆంధ్ర ఊటీ గా పిలవబడే అరకు లో సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అరకు లో పలు గిరిజన జాతులు నివాసముంటున్నాయి. సమాజానికి ఉపయోగ పడేలా ఏదైనా చేయాలనే తలంపు తో ఉన్న స్టార్ హీరోయిన్ కాజల్ అరకు లో స్కూల్ కట్టించారు. గత రెండేళ్ళుగా ఆ స్కూల్ దిగ్విజయం గా నడుస్తుంది. తొలి సారి కాజల్ అగర్వాల్ ఆ స్కూల్ గురించి వెల్లడించారు.

అరకు అంటే ఇష్టమని, అరకు లో జరిగే షూటింగ్స్ లోపాల్గొన్నానని, అక్కడి గిరిజనులతో మాట్లాడిన తరువాత వారి పిల్లలకు కనీస విద్య అందడం లేదని తెలిసిందని, అందుకే అక్కడ ఒక స్కూల్ నిర్మించానని, డొనేషన్స్ కూడా కలెక్ట్ చేశానని, అవి సక్రమంగా ఉపయోగ పడు తున్నాయా లేదా అని గమనిస్తూ ఉంటానని, తనకున్న సినిమా బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆ స్కూలుకు వెళ్ళడం కుదరడం లేదని, తన టీమ్ అక్కడి వీడియోస్ పంపుతుంటారని, అక్కడి పిల్లలు తనను అక్కా అని పిలవడం ఆనందం గా ఉంటుందని కాజల్ అగర్వాల్ వివరించారు. మనవిద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్ లో చదువుతున్నారని, గిరిజన విద్యార్థులకు కనీస ప్రాధమిక విద్య అయినా అవసరమని, మరిన్ని స్కూల్స్ నెలకొల్పాలని అనుకుంటున్నట్టుగా కాజల్ తెలిపారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here