తిరువనంతపురం లో మహావీర్ కర్ణ మూవీ పూజ

Chiyaan Vikram Mahavir Karna Movie Pooja at Thiruvananthapuram,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Hero Vikram Mahavir Karna Movie Launched at Thiruvananthapuram,Mahavir Karna Movie Pooja at Thiruvananthapuram,Mahavir Karna Movie Latest News,Hero Vikram Historical Film Mahavir Karna Pooja at Thiruvananthapuram
Chiyaan Vikram Mahavir Karna Movie Pooja at Thiruvananthapuram

దర్శక ధీర రాజమౌళి దర్శకత్వం లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి మూవీ ఘనవిజయం సాధించిన తరువాత అన్ని భాషలలోనూ పీరియాడిక్ మూవీస్ జోరు పెరిగింది. ప్రస్తుతం భారతీయ భాషల చిత్ర పరిశ్రమల కళ్ళన్నీ మహాభారత కథ మీదనే ఉన్నాయి. ఇప్పటికే శశి కుమార్ మీనన్ దర్శకత్వంలో మహాభారతం రెండు భాగాలుగా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో బి ఆర్ శెట్టి నిర్మించనున్న విషయం తెలిసిందే.

యునైటెడ్ ఫిల్మ్ కింగ్ డమ్ బ్యానర్ పై స్టార్ హీరో విక్రమ్ కర్ణుడిగా ఆర్ ఎస్ విమల్ దర్శకత్వం లో 300కోట్ల రూపాయల బడ్జెట్ తో తమిళ,తెలుగు, మలయాళం, హిందీ భాషలలో మహావీర్ కర్ణ సినిమా రూపొందనుంది. వివిధ భాషల ప్రముఖ నటులు నటించే మహావీర్ కర్ణ మూవీ ప్రపంచవ్యాప్తం గా 32 భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానుంది. మహావీర్ కర్ణ సినిమా పూజా కార్యక్రమాలు తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం లో ఘనం గా జరిగాయి. ఈ కార్యక్రమంలో పూలతో అలంకరించిన గంటకు చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఈ గంటను రామోజీ ఫిల్మ్ సిటీ లోని ప్రత్యేక సెట్ కు తరలించారు. ఈ గంటను 30అడుగుల ఎత్తులో ఉండే రథానికి అమరుస్తారు. స్టార్ హీరో విక్రమ్ నటించే మహావీర్ కర్ణ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

 


 


Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here