మీరు మెచ్చిన టాలీవుడ్ 2018 బెస్ట్ డైరెక్టర్?

ఒక సినిమా మంచిగా రావాలంటే దానికి మంచి కథ, కథనం, సంగీతం ఇలా ఉన్న 24 క్రాఫ్ట్స్ కరెక్ట్ గా ఉంటేనే సినిమా ఔట్ పుట్ కూడా మంచిగా వస్తుంది. మరి ఇన్ని విభాగాలను సమర్థవంతంగా నడిపే వ్యక్తి.. కెప్టెన్ ఎవరంటే? ఇంకెవరూ డైరెక్టర్. ఉన్న 24 క్రాప్ట్స్ ను సమర్థవంతంగా ఉపయోగించుకొని తమకు కావాల్సిన…రావాల్సిన ఔట్ పుట్ ను రప్పించుకొని..తన ఆలోచనలకు ప్రాణం పోసి తెరపైకి ఒక దృశ్యముగా మలిచి రెండున్న గంటల సినిమాను తెరకెక్కించి వినోదాన్ని అందించే వ్యక్తి.

ఎంత గొప్ప నటుడయినా సరే దర్శకుడు చెప్పినట్టు చెయ్యాలి. తనకి తోచిన విధానంలో నటుడు నటించినా దర్శకుడు ‘సరే’ అనాలి. డైరెక్టర్ కు నచ్చి టేక్ ఓకే చేసేంత వరకూ చేయాల్సిందే. అప్పుడే తాను అనుకున్న విధంగా సీన్ పండుతుంది…సినిమా కూడా సక్సెస్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి ఇప్పటి వరకూ ఎంతో మంది డైరెక్టర్లు తెలుగు తెరకు పరిచయమయ్యారు. రోజులు మారుతున్న కొద్ది..కొత్త కొత్త కథలు.. కొత్త కొత్త డైరెక్టర్లు.. పరిచయమవుతూనే ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అయితే యంగ్ డైరెక్టర్ల హవా నడుస్తుందని చెప్పొచ్చు. ప్రేక్షకుల ఆలోచన ధోరణి కూడా మారడంతో…వారు తీస్తున్న సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక కొంతమంది పాత డైరెక్టర్లు కూడా కాస్త స్లో అయినా…కొంత మంది మాత్రం తమ కథలతో ఇంకా టాప్ రేస్ లోనే ఉన్నారు.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది..సుకుమార్, కొరటాల, త్రివిక్రమ్. ఎన్నో ఏళ్లుగా సినిమా చేస్తున్నా…కథ కథకి ఏదో ఒక వైవిద్యం చూపిస్తూ..బ్లాక్ బస్టర్ సినిమాలు అందిస్తూ టాప్ డైరెక్టర్లుగానే కొనసాగుతున్నారు. ఈ ఏడు వీరి డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం, భరత్ అనే నేను, అరవింద సమేత వేటికవే స్పెషల్ అని చెప్పొచ్చు. అందుకే అంతటి ఘన విజయాలను సొంత చేసుకున్నాయి. ఇక యంగ్ డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, పరుశురాం, అజయ్ భూపతి ఇప్పుడిప్పుడే తెలుగు తెరపై తమ ముద్రను బలంగా వేయడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిలో నాగ్ అశ్విన్, పరుశురాం గతంలో సినిమాలు చేసినా… ఈ ఏడాది వీరి డైరెక్షన్ లో వచ్చిన మహానటి, గీత గోవిందం తీసుకొచ్చిన గుర్తింపు ఇంతకుముందు సినిమాల వల్ల రాలేదనే చెప్పొచ్చు. ఇక ఆర్ఎక్స 100 ఒక్కసారిగా తుఫాన్ లా వచ్చి మొదటి సినిమాతో సక్సెస్ ను సొంత చేసుకున్నాడు అజయ్ భూపతి. మరి టాప్ డైరెక్టర్స్…యంగ్ డైరెక్టర్స్ సినిమాలతో ఈ ఏడాది ముగింపుదశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మీకు నచ్చిన..మీరు మెచ్చిన టాలీవుడ్ 2018 బెస్ట్ డైరెక్టర్ ఎవరో మీ ఓటు ద్వారా తెలపండి.

టాలీవుడ్ 2018 బెస్ట్ డైరెక్టర్?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here