టాలీవుడ్ 2018 బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్?

2018 Tollywood Best Music Director,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Best Music Director in the Year of 2018,Best Music Director in Tollywood,Vote For the Best Telugu Music Director,Best Telugu Music Director of 2018
2018 Tollywood Best Music Director

సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా హిట్టయినట్టే ఇది ఒకప్పటి పరిస్థితి. ఆడియో కు మంచి రెస్పాన్స్ వస్తే చాలు…సగం సినిమా హిట్టయినట్టే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే. సినిమాలో అంత కీ రోల్ ప్లే చేస్తుంది ఈ సంగీతం. ఏదో మ్యూజిక్ కంపోజ్ చేసేశామా..మా పని అయిపోయిందా అన్నట్టు చేయరు ఏ ఒక్క మ్యూజిక్ డైరెక్టర్. తమ ప్రాణం పెట్టి మరీ మ్యూజిక్ అందిస్తుంటారు. అందుకే కొన్ని పాటలు ఎన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ మరిచిపోలేము. ఆనాడు ఘంటసాల మొదలుకొని ఈ నాటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల వరకూ ఎన్నో సినిమాలు…ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎన్నో అద్భతమైన పాటలను వినిపించారు. వినిపిస్తున్నారు.. వినిపిస్తూనే ఉంటారు.

ఇక ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లలో ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్, థమన్. ఎస్ ఫుల్ డిమాండ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు. ఈ ఏడాది ప్రారంభంలోనే..రంగస్థలం, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు మ్యూజిక్ అందించి మంచి హిట్స్ కొట్టాడు దేవి. ఇక థమన్ అరవింద సమేత కు ఇచ్చిన మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆ సినిమాలో పెనివిటి సాంగ్ కు వచ్చిన గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మెలొడీ బ్రహ్మ మణిశర్మ తో ఇప్పుడొస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లను పోల్చి చూడకూడదు. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడు మణిశర్మ. మణిశర్మ సంగీత దర్శకుడుగా ఉంటే చాలు..సగం సినిమా హిట్టయినట్టే అన్న అభిప్రాయం ఉండేది. రానురాను యూత్‌ టాలెంట్‌ రావడంతో..కాస్త స్లో అయినా మళ్లీ ఈ మధ్య ఫామ్ లోకి వచ్చారు. ఇక అటు తమిళంలోనూ..ఇటూ తెలుగులోనూ అవకాశాలతో దూసుకుపోతున్నాడు అనిరుధ్ రవిచందర్. హ్యాపి డేస్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మిక్కీ జే మేయర్ పలు సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇక గోపి సుందర్ గీత గోవిందం సినిమాలో మంచి మ్యూజిక్ అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఈ ఏడాది సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు కింద ఇచ్చాం. వారిలో మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్..ఎవరో? 2018 బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలపండి?

టాలీవుడ్ 2018 బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=R7EhX6INsUo]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here