ద యంగెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ద టాలీవుడ్ సిద్దార్థ్ – కూల్ అండ్ కామ్

Young Director of the Telugu Film Industry Siddharth Thatholu,Siddhartha Thatholu - The Young Soul Who Made Bhairava Geetha,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Bhairava Geetha Movie Latest Updates,The Young Director Siddhartha Thatholu Latest News,RGV About Siddhartha Thatholu,Bhairava Geetha Telugu Movie Latest News,#BhairavaGeetha, Director Siddhartha Thatholu About Bhairava Geetha,Young Director of TFI Siddharth Thatholu
Young Director of the Telugu Film Industry Siddharth Thatholu

పిట్ట కొంచం కూత ఘనం అనే సామెత మనం వింటూనే ఉంటాం…ఈ సామెత ఏ సందర్బంలో వాడుతారో కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఓ వ్యక్తిని చూస్తుంటే ఆ సామెత చెప్పకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు సిద్దార్ధ్ తాతోలు. భైరవగీత డైరక్టర్, వర్మ శిష్యుడు అంటే తొందరగా గుర్తుకొచ్చేస్తుంది ఎవరికైనా. ఆర్ ఎక్స్ 100 సినిమా తీస్తున్నప్పుడు వర్మ శిష్యుడు అజయ్ భూపతి ఈ సినిమా తీస్తున్నాడని అందరూ క్యూరియాసిటీతో సినిమా చూశారు. అక్కడక్కడ కాస్త బోల్డ్ సీన్స్ కూడా ఉండటంతో ఎంతైనా వర్మ శిష్యుడు కాబట్టి ఇలాంటి సీన్స్ కామనే అని.. సినిమాలో కంటెంట్ ఉండటంతో అందరూ సైలెంట్ అయిపోయారు.

ఆ తరువాత మళ్లీ మరో వర్మ శిష్యుడు…ఈసారి ఏకంగా వర్మ ప్రొడక్షన్ లో సినిమా అనగానే అంతే ఎగ్జైట్ మెంట్ తో అందరూ చూశారు. ఇక సినిమా ప్రారంభమైంది…ఈ సారి డైరెక్టర్ ఎవరబ్బా.. ఎవరు ఈ సిద్దార్ధ్ తాతోలు అని అందరూ తెగ సెర్చ్ చేయగా అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. కనీసం వర్మ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఎక్స్ పీరియన్స్ అంత వయసు కూడా ఆ మనిషికి లేదు. కేవలం 23 ఏళ్లకే రామ్ గోపాల్ వర్మతో పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నాడంటే మాములు విషయం కాదు.

ఇంజనీరింగ్ చదివి.. షార్ట్ ఫిలింస్ తీస్తున్న సమయంలో వర్మ కంట్లో పడ్డాడు సిద్దార్ధ్ తాతోలు. తాను ఓ వెబ్ సిరీస్ తీస్తున్న సమయంలో సిద్దార్థ్ కనిపించాడని తను చెప్పిన కాన్సెప్ట్, కొన్ని సజెషన్స్ చూసి నేనే తనని సినిమా తీయమని చెప్పానని వర్మ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అంతే కాదు సిద్దార్ధ్ పనితనం చూసి వర్మ పలు ఇంటర్వ్యూల్లో ప్రశంసిస్తూనే ఉన్నాడు. నిజానికి భైరవగీత సినిమా మేకింగ్ చూసిన ఎవరైనా ఆ విషయం ఒప్పుకోక తప్పదు. చూడటానికి చాలా రిజర్వ్డ్ గా కనిపించే సిద్దార్థ్ ఎన్నో సినిమాలు తీసిన అనుభవం ఉన్నట్టే భైరవగీత సినిమా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. అందుకే వర్మ కూడా సిద్దార్ద్ కు ఫిదా అయిపోయినట్టున్నాడు.

ఏది ఏమైనా ఇంత చిన్న వయసులోనే ఒక సినిమాకు దర్శకత్వం వహించి తెరకెక్కించాడంటే.. అతడిలో ఉన్న పట్టుదల కనిపిస్తోంది. యంగ్ బ్లడ్..ఉరకలేస్తుంది అన్నట్టు.. ఈ సినిమా మేకింగ్ చూస్తుంటే…సినిమాపై తనకున్న ప్యాషన్ అర్ధమవుతుంది. ఇంత మంది స్టార్ డైరెక్టర్ లు…ఎన్నో ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్న వాళ్లు ఉన్న ఈ ఇండస్ట్రీలో ఇలాంటి యంగ్ టాలెంట్ కూడా రావడం…దానికి వర్మ ప్రోత్సాహం అందించడం గొప్ప విషయమే. మరి భైరవగీత సినిమా మంచి హిట్టయి.. ముందు ముందు సిద్దార్ధ్ మంచి మంచి సినిమాలు తీయాలని..ఎంతో మంది యంగ్ స్టర్స్ కు స్పూర్తిగా నిలవాలని కోరుకుందాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here