శంకర్ చేసిన అన్ని సినిమాల్లో తన ఫేవరేట్ సీన్ ఏంటో తెలుసా?

Director Shankar Reveals his Career Best Scene,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Director Shankar About His Best Scene,Director Shankar Latest Movies Updates,Director Shankar Talks About His Favourite Scene,Director Shankar Reveals Best Scene in His Cinema Career
Director Shankar Reveals his Career Best Scene

తాను తీసే ప్రతి సినిమాలో ఏదో ఒక మేసేజ్ తో పాటు..ఎంతో వైవిధ్యంగా.. కొత్తగా తెరకెక్కించడంలో డైరెక్టర్ శంకర్ రూటే వేరు. ఇప్పటి వరకూ తాను చేసిన అన్ని సినిమాలు మంచి ఘనవిజయం సాధించడానికి కూడా అదే కారణం. ఇక రోబోతో ఇండియన్ సినిమాను ఒక మెట్టు ఎక్కించిన శంకర్..ఇప్పుడు 2.0తో హాలీవుడ్ స్థాయి రేంజ్ కు తీసుకెళ్లారు. 2.0లో శంకర్ క్రియేట్ చేసిన విజువల్ వండర్ చూడాలంటే మరో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే.

ప్రస్తుతం సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న శంకర్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా శంకర్ చెప్పిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తాను చేసిన సినిమాలన్నింటిలో తనకు ఇష్టమైన సీన్ గురించి చెప్పాడు. ఇంతకీ శంకర్ కు ఇష్టమైన సీన్ ఏంటో మీకు కూడా తెలుసుకోవాలనుంది కదా? ఏంటంటే.. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఒకే ఒక్కడు సినిమా గుర్తుండే ఉంటుంది కదా. ఆసినిమాలో అర్జున్, రఘువరన్ ను ఇంటర్వ్యూ చేసే సీన్ కూడా గుర్తుండే ఉంటుంది. సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే సీన్ అదే. తాను ఇప్పటివరకూ తీసిన అన్ని సినిమాల్లో..ఈ సినిమాలోని ఆ సీనే తన ఫేవరెట్ సీన్ అట. మరి నిజంగానే ఈ సీన్ చూసినప్పడు ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here