ప్రస్తుతం సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఎదైనా ఉందంటే అది 2.0 సినిమా అని టక్కున చెప్పేయొచ్చు. శంకర్ చేసిన మాయాజాలాన్ని, విజువల్ వండర్స్ ను ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 29న సినిమా రిలీజ్ అవుతుండటంతో.. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా పాల్గొంటున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ నేపథ్యంలో శంకర్ కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగానే ఆయన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తోంది.
అదేంటంటే… 2.0 సినిమా రోబో సీక్వెల్ అని తెలుసు కదా. రోబో సినిమాలో రజినీ సరసన ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ నటించిన సంగతి కూడా విదితమే. ఈ సినిమలో వీరిద్దరి జోడి అందరికీ నచ్చేసింది. ఇక అసలు సంగతేంటంటే.. 2.0 సినిమాలో కూడా ఐశ్వర్యరాయ్ కనిపించనుందట..ఓ చిన్న అతిధి పాత్ర లో ఐష్ కనిపించనుందట. ఈ విషయాన్ని తమిళ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ చెప్పినట్టు తెలుస్తోంది.
కాగా భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాను శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో రజినీ కాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ను ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈనెల 29న రిలీజ్ అవుతున్న 2.0 సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 10,000 స్క్రీన్స్ పై రిలీజ్ చేయనున్నారు. మరి ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
[youtube_video videoid=KGJeHRngJBw]