డిఫరెంట్ రోల్ లో నటిస్తున్న రకుల్

Rakul To Play a Different Role In Her Upcoming Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Rakul Preet Singh Upcoming Movies,Rakul Preet Singh Plays a Different Role in Her Next Movie,Rakul New Movies Updates,Rakul Preet Singh Playing Widow Role in Her Upcoming Film,Rakul Latest Movies Updates,Rakul To Play a Different Character in Her Next Project
Rakul To Play a Different Role In Her Upcoming Movie

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు సినీ రంగంలో ప్రవేశించి.. ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి..దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరి స్టార్ హీరోస్ నటించేసింది. ఈ మధ్య తెలుగులో కాస్త గ్యాప్ ఇచ్చిన అమ్మడు తమిళంలో మాత్రం ఫుల్ బిజీ అయిపోయింది. అక్కడ కూడా మంచి స్టార్ గా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది.

ఇప్పటికే రకుల్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తమిళ్ సూపర్ స్టార్ సూర్య నటిస్తున్న ఎన్.జీ.కే సినిమాలో.. కార్తీతో దేవ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దానితో పాటు శివ కార్తికేయన్ సినిమాలో కూడా రకుల్ నటిస్తోంది. గత కొద్ది కాలం క్రితం ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో ఓ విభిన్న పాత్రలో నటిస్తున్నట్టు రకుల్ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో తాను ఆస్ట్రోనమనర్ అంటే.. అంతరిక్ష పరిశోధకురాలిగా నటిస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తెలిపింది. జనవరి కల్లా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని…పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇతర పనులు ఉండటంతో ఇంకా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయలేదని చెప్పింది. మరి తెలుగులో ఈ అమ్మడు తరువాత సినిమా ఎప్పుడో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here