గీతాంజలి మూవీ ద్వారా మలయాళ చిత్ర సీమలో ప్రవేశించిన కీర్తి సురేష్ ఇదు ఎన్నమాయం సినిమాతో తమిళ్ లో, నేను శైలజ మూవీ తో తెలుగుచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. తెలుగు, తమిళ్ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కీర్తి సురేష్ తెలుగు లో నటించిన నేను శైలజ, మహానటి, తమిళంలో సండకోళి 2, సర్కార్ సినిమాలు ఘనవిజయం సాధించాయి. కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూ లో తన మనసులోని మాట తెలిపారు.
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తన మోస్ట్ ఫేవరెట్ హీరో అని, మహేష్ బాబు తో నటించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న లక్షలాది మంది అభిమానులలో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీ లు కూడా ఉన్నారు. మహేష్ బాబు తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని హీరోయిన్స్ ఆశ పడతారు. హీరోయిన్ కీర్తి సురేష్ కోరిక త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
[youtube_video videoid=FarYE-EAuAw]