ఒకటి కాదు రెండు దాదాపు ఆరేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటొని సినిమాతో తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. బర్ఫీ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఇలియానా ఆ తరువాత అక్కడే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఇన్నేళ్లకు శ్రీను వైట్ల అడగటంతో…తనకు కూడా స్టోరీ నచ్చి తెలుగులో మంచి కమ్ బ్యాక్ అవుతుందని ఈ సినిమా చేశానని ఇప్పటికే ఇలియానా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. అంతేకాదు తను డిమాండ్ చేసినంత రెమ్మునరేషన్ కూాడా ఇవ్వడానికి రెడీ అయి మరీ ఇలియానాను ఈసినిమాలో హిరోయిన్ గా తీసుకున్నాడు శ్రీనువైట్ల. నిజానికి అంత గ్యాప్ వచ్చిన తరువాత అంత రెమ్యూనరేషన్ అడగటానికి ఏ హీరోయిన్ ధైర్యం చేయదు.. ఇక ఆమె అడిగింత ఇవ్వడానికి డైరెక్టర్లు కూడా ఒప్పుకోరు. కానీ ఇలియానా విషయంలో రెండూ వర్కవుట్ అయ్యాయి.
కానీ రెమ్యూనరేషన్ లో వర్కవుట్ అయింది కానీ.. సినిమా మాత్రం అంత వర్కవుట్ కాలేదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఇలియానా మళ్లీ బాలీవుడ్ చెక్కేయనుంది. అనీజ్ బజ్ మీజ్ డైరెక్షన్ లో జాబ్ అబ్రహం హీరోగా పాగల్ పంతి సినిమాలో ఇలియానాకు అవకాశం రావడంతో మళ్లీ బాలీవుడ్ కు వెళ్లిపోనుంది. గతంలో అనీజ్ డైరెక్షన్ లో ముబారకన్ సినిమాలో నటించిన ఇలియానా రెండో సారి మళ్లీ అదే డైరెక్టర్ తో పనిచేయనుంది. మొత్తానికి ఒక్క సినిమాకే ఇలియానా మళ్లీ బాలీవుడ్ కి వెళ్లిపోయింది. మరి రెండో సినిమాకు ఎన్నేళ్లు తీసుకుంటుందో?
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
[youtube_video videoid=024DhvRCnPo]