మరో సిన్సియర్ పోలీస్ స్టోరీ రోషగాడు

Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Roshagadu Movie Public Talk, Roshagadu Movie Review, Roshagadu Movie Review & Rating, Roshagadu Movie Story, Roshagadu Review, Roshagadu Telugu Movie Live Updates, Roshagadu Telugu Movie Plus Points, Roshagadu Telugu Movie Public Response, Roshagadu Telugu Movie Review, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Roshagadu Telugu Movie Review

గత మూడు సంవత్సరాలుగా సంవత్సరానికి కనీసం రెండు చిత్రాల చొప్పున నిర్మిస్తూ, నటిస్తూ, సంగీత దర్శకత్వం వహిస్తూ తమిళ, తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యూవర్షిప్ ను సాధించుకున్న సిన్సియర్ ఫిలిం మేకర్ విజయ్ అంటోని. నేను హీరోని కాదు.. నా కథే హీరో అని సవినయంగా ప్రకటించే విజయ్ ఆంటోని నిజంగానే డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల అంచనాలను అందుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ప్రతి సినిమా “బిచ్చగాడు” రేంజ్ విజయాన్ని సాధించక పోయినా మినిమం గ్యారంటీ చిత్రాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి విజయ్ అంటోని సినిమాలు. ఎలా ఉన్నా ఒకసారి చూడాలి అనే నమ్మకాన్ని ప్రేక్షకులలో కలిగించిన విజయ్ ఆంటోని తాజా చిత్రం ” రోషగాడు” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వర్సెస్ ఏంటీ సోషల్ ఎలిమెంట్స్ నేపద్యంలో గతంలో ఎన్నో చిత్రాలను చూసి ఉన్న ప్రేక్షకులను ఈ సరికొత్త పోలీస్ కథ ఎలా అలరిస్తుందో రివ్యూలో చూద్దాం.

కథాంశం:
కుమారస్వామి( విజయ్ అంటోని) కానిస్టేబుల్ స్థాయి నుండి తన సిన్సియారిటీ తో ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగిన సిన్సియర్ పోలీస్. దారి తప్పి రౌడీ గ్యాంగులతో తిరుగుతున్న సొంత తమ్ముడినే ఎన్కౌంటర్ చేసిన డ్యూటీ మైండెడ్ పోలీస్ ఆఫీసర్ కుమారస్వామి అంటే ఆ సిటీ లో క్రమంగా అందరికీ గౌరవం పెరుగుతుంది. 18 ఏళ్ళ లోపు మైనర్ బాయ్స్ ను చేరదీసి, ప్రలోభ పెట్టి వాళ్ల ద్వారా నేరాలు చేయిస్తే శిక్షలు ఉండవు అనే ధీమాతో ఆ వయసు పిల్లలను కరుడుగట్టిన నేరస్తులుగా తయారు చేస్తుంటాడు బాబ్జి( దీనా) అనే రౌడీ షీటర్.
కానిస్టేబుల్ స్థాయి నుండి పోలీస్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ మీద ఆ సిటీకి వచ్చిన కుమారస్వామి ముందుగా బాబ్జీని అరెస్టు చేసి వాడి ఆగడాలను అరికడతాడు అనుకుంటారు అందరూ.

కానీ బాబ్జీని అంతమొందించినన్త మాత్రాన సమస్య పరిష్కారం కాదు… వాడి మాయలోపడి, రౌడీజం మత్తులో జోగుతున్న పిల్లలను సంస్కరించి వారిలో మార్పు తెచ్చినప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని భావించిన కుమారస్వామి ఆ లక్ష్యం కోసం ఏం చేశాడు? పిల్లలలోనూ, ఆ ఊరి జనంలోనూ ఎలాంటి మార్పు తెచ్చాడు.. విర్రవీగిన బాబ్జిని ఎలా అంతమొందించాడు… ఇదీ మిగిలిన కథ.

మామూలుగా పోలీస్ కథలన్నీ సిన్సియర్ ఆఫీసర్ కు విలన్ గ్యాంగ్ కి మధ్య జరిగే యుద్ధం తో ప్రారంభమై యుద్ధంతో ముగుస్తాయి. అయితే ఇందులో బాల నేరస్తుల సంస్కరణ అనే ఒక కొత్త కోణాన్ని తీసుకోవటం అభినందనీయంగా ఉంది.

డైరెక్షన్ :

తమిళ దర్శకుడు గణేష దర్శకత్వంలో రూపొందిన “రోషగాడు” అనువాద చిత్రాన్ని పోలీస్ కథలలో ఒక డిఫరెంట్ స్టోరీగా చెప్పుకోవచ్చు. సినిమా ఎత్తుగడ నుండి ఇంటర్వెల్ పాయింట్ దాకా మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో అండర్ ప్లే చేసిన దర్శకుడు గణేష ద్వితీయార్థంలో రెగ్యులర్ కమర్షియల్ పంథాను ఫాలో అయ్యాడు. చెప్పదలుచుకున్న పాయింట్ ను చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినా ఓవరాల్ గా తీసుకుంటే” రోషగాడు” పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి మోరల్ సపోర్ట్ ఇచ్చే సినిమా అనటంలో ఎలాంటి సందేహం లేదు. పోలీస్ డ్యూటీ లోని సాధకబాధకాల గురించి, ఆ జాబ్ లో ఉండే బాధ్యత, ఆత్మవిశ్వాసం, అంకిత భావాల గురించి కొన్ని సీన్స్ లో చాలా చక్కగా, చాలా ఎఫెక్టివ్ గా చెప్పాడు దర్శకుడు గణేష.

ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్:

కుమారస్వామి అనే పోలీస్ ఆఫీసర్, అతని స్టేషన్లోనే పనిచేసే ఒక లేడీ ఇన్స్ పెక్టర్, బాబ్జి అనే విలన్, నలుగురు కుర్రాళ్ళు- ఇవే రోషగాడు లో ప్రధాన పాత్రలు. నిజానికి తానే చెప్పినట్లు విజయ్ ఆంటోని గొప్ప నటుడేమీ కాదు.. అయితే ఎన్నుకున్న పాత్రలో ఉన్న ఎమోషన్స్ ను, సీరియస్నెస్ ను
త్రూ ఔట్ మెయింటెన్ చేస్తూ ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు విజయ్ ఆంటోని. ఇక లేడీ ఇన్స్పెక్టర్ గా నివేత పేతురాజ్ (హీరోయిన్) నటన చాలా నాచురల్ గా, ఫెమినైన్ గా ఎంటర్టైన్ చేసింది. మెయిన్ విలన్ బాబ్జి క్యారెక్టర్ లో( దీనా) ఓకే అనిపించాడు. మైనర్ బాయ్స్ గా నలుగురు కుర్రాళ్ళ లో మంచి క్యారెక్టర్ ఫిట్ నెస్ కనిపించింది.

ఇక టెక్నికల్ గా చెప్పాలంటే – విజయ్ అంటోని మ్యూజిక్ అండ్ ఎడిటింగ్, రిచర్డ్ నాథన్ కెమెరా, ఫాతిమా విజయ్ ఆంటోనీ మేకింగ్ వాల్యూస్ up to the mark ఉన్నాయి. ఇక ఈ డబ్బింగ్ వెర్షన్ లో ప్రత్యేకంగా అభినందనలు చెప్పాల్సింది భాషా శ్రీ అనువాదానికి. డబ్బింగ్ ఫిలిం అనే ఫీలింగ్ రాకుండా స్ట్రైట్ సినిమా చూస్తున్నంత నేటివిటి ని డైలాగ్ రైటింగ్ లో చూపించాడు భాషా శ్రీ.

పోలీస్ డ్రామా గా వచ్చిన ఈచిత్రం చాలా వరకు ఆకట్టుకుంది. చివరగా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు.

 

రోషగాడు తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • Acreenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=cv7eM2wYrwk]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here