ఇది అలాంటి కథ – సింగిల్ సిట్టింగ్ లో ఒప్పుకున్నాడు

Ravi Teja Impressed With Amar Akbar Anthony Storyline,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Ravi Teja About Amar Akbar Anthony,Pivot of Ravi Teja Amar Akbar Anthony Looks Intriguing,Amar Akbar Anthony Movie Latest News,#AmarAkbarAnthony,Director Sreenu Vaitla About Amar Akbar Anthony Movie,Sreenu Vaitla Reveals Details about Amar Akbar Anthony
Ravi Teja impressed with Amar Akbar Anthony storyline

టాలీవుడ్ లో సపరేట్ కామెడీ ట్రాక్ సృష్టించిన శ్రీనువైట్ల, మాస్ మాహా రాజ్ రవితేజ కాంబినేషన్ లో అమర్ అక్బర్ ఆంటొని సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 16న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనువైట్ల ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

చాలా కాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నా.. వరుస ఫెయిల్యూర్స్ నన్ను చాలా మార్చాయి.. నిజానికి నన్ను స్ట్రాంగ్ చేశాయి..ఎలాగైనా ఒక ఫ్రెష్ కథతో రావాలని అలోచించి నూతన రచయితలతో దాదాపు 8 నెలలు కూర్చొని అమర్ అక్బర్ ఆంటోని కథను రాసుకున్నాం..కథ రాస్తున్నప్పుడే ఈ కథకు కరెక్ట్ గా సెట్ అయ్యే కథానాయకుడు రవితేజ అని ఫిక్స్ అయ్యామని తెలిపాడు. అంతేాకాదు.. ఈ సినిమా పాయింట్ బేస్డ్ మూవీ అని.. ఇప్పుడే ఈ సినిమా గురించి అన్నీ చెప్పలేను.. కానీ గతంలో నేను రవితేజ చేసిన సినిమాలన్నింటకంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పాడు. రవితేజ సింగిల్ సిట్టింగ్ లో ఈ కథను ఓకే చేశాడు..ఎంతో మంది నిర్మాతలు ఉన్నాకానీ.. నా ఫ్రెండ్స్ మైత్రీ మూవీ మేకర్స్ వారితోనే సినిమా చేయాలనుకున్నానని పలు విషయాలు తెలిపారు.

మరి నిజంగానే గత కొద్దికాలంగా ఆశించినంత విజయాలు రాని నేపథ్యంలో శ్రీనువైట్ల మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. రవితేజ కూడా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇలియానా కూడా ఈసినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. మరి ముగ్గురికి సరైస సక్సెస్ రావాలని ఆశిద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=LKK0SZcdGaw]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here