పోకిరి గురించి ఇలియానా చెప్పిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ట్

Ileana and Manjula Share a Special Memory About Pokiri,Ileana Upcoming Movies Updates,Ileana Reveals Details About Pokiri in an Interview,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Ileana Movies Latest News,Ileana Latest Interview,Ileana About Pokiri in an Interview,#AmarAkbarAnthony,Amar Akbar Anthony Movie Latest News
Ileana Reveals Details About Pokiri in an Interview

దాదాపు ఏడెనిమిదేళ్ల గ్యాప్ తరువాత గోవా సుందరి ఇలియానా మళ్లీ అమర్ అక్బర్ ఆంటొని సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు సినిమాల్లో కిక్, ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న రవితేజతో మళ్లీ ఇలియానా జోడి కట్టింది. ఇక ఈసినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఎప్పుడూ ఈవెంట్లలో, ఇంటర్వ్యూలలో పాల్గొనని ఇలియానా తన పంథా మార్చుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంది. అలాగే పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది.

ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇక్కడ జులాయి సినిమా చేస్తున్న సమయంలో బాలీవుడ్‌ నుంచి బర్ఫీ చిత్రం నుంచి అవకాశం వచ్చింది.. స్క్రిప్టు కూడా నచ్చడంతో అక్కడికి వెళ్లి ఆ సినిమా చేశాను. ఆ తర్వాత తెలుగులో కూడా నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ ఆ కథలు నచ్చకపోవడ.. కొన్ని కారణాల వల్ల చేయలేదు అంతే. అప్పటినుండి సరైన కథ కోసమే చూస్తున్నాను. నేనైతే టాలీవుడ్ కు దూరంగా ఉందామని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు శ్రీను వైట్ల ఈ చిత్రకథ చెప్పినపుడు నాకు చాలాబాగా నచ్చింది. నాకు తెలుగులో రీఎంట్రీకి ఇదే సరైన సినిమా అని వెంటనే అంగీకరించానని చెప్పింది.

అంతేకాదు.. స్టోరీ సెలక్షన్స్ గురించి మాట్లాడుతూ…నేను దేవదాస్ సినిమా ఒప్పుకున్నప్పుడు ఇరవైఏళ్లు.. అప్పుడు సినిమా చేయాలన్న కోరిక ఉండేదే కానీ కథలపై అవగాహన లేదు.. అంతెందుకు..నేను పోకిరి సినిమా కూడా చేయ్యాలని అనుకోలేదు..కానీ మహేష్‌బాబు సోదరి మంజుల ఫోన్ చేసింది. చాలా మంచి కథ అని చెప్పి ఆ సినిమాను చేయమని ఒప్పించింది.. ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్టయిందో తెలుసు కదా.. నా కెరీర్‌ నే మలుపుతిప్పింది ఆ సినిమా..ఒక్కోసారి మనకు తెలియకుండానే మంచి చెడులు జరిగిపోతుంటాయి అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మరి నిజంగానే పోకిరి సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసింది. అలాంటి సినిమాను కనుక ఇలియానా నిజంగానే మిస్సయి ఉంటే..ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో..ఒప్పుకొని మంచిపని చేసింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=9Ja8C1ovyDk]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here