Beware of cellphones అని హెచ్చరించే కర్త కర్మ క్రియ

Kartha Karma Kriya Movie Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Movie Updates 2018,Telugu Cinema News,Kartha Karma Kriya Review,Kartha Karma Kriya Telugu Movie Review,Kartha Karma Kriya Movie Story,Kartha Karma Kriya Telugu Movie Live Updates,Kartha Karma Kriya Movie Public Talk,Kartha Karma Kriya Telugu Movie Public Response,Kartha Karma Kriya Movie Plus Points,Kartha Karma Kriya Telugu Movie Review & Rating
Kartha Karma Kriya Movie Review

గతంలో శ్రీహరి ప్రధాన పాత్రలో “weekend love” అనే ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీ తో దర్శకుడుగా మారిన జర్నలిస్ట్ నాగు గవర తాజాగా అందించిన టెక్నికల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ “కర్త కర్మ క్రియ” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజున నిత్యావసరాలైన తిండి, బట్ట, నీటి కంటే కూడా సెల్ ఫోన్ అనేది మనిషి జీవితాన్ని ఎంతగా శాసిస్తుందో చూస్తూనే ఉన్నాము. చేతిలోని సెల్ ఫోన్ ప్రపంచదర్శినిగా, సమగ్ర గ్రంథాలయంలాగా ఉపయుక్తమవుతుంది… అదే సెల్ ఫోన్ సకల వినాశనకారిగా కూడా దుర్వినియోగం కాబడుతుంది . ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ వాడటంలో ఎంత ఎలర్ట్ గా ఉండాలో హెచ్చరించే కథాంశాన్ని తీసుకొని నాగు గవర అందించిన క్రైం థ్రిల్లర్ కర్త కర్మ క్రియ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

ఇందులో హీరో వసంత్ (వసంత్ సమీర్) సెల్ఫోన్ మెకానిక్ గా పనిచేస్తుంటాడు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన హీరో ఎదుగూ బొదుగూ లేని తన జీవితాన్ని డబ్బున్నవాళ్ళతో పోల్చుకుంటూ నిరాశ పడుతుంటాడు. అవసరాలు, జల్సాల కోసం అప్పులు చేస్తుంటాడు.

ఇలాంటి స్థితిలో తన ఫ్రెండ్ పనిచేస్తున్న మోటార్ బైక్ షో రూమ్ లో లక్కీ డ్రా తీస్తుంటే వెళ్లి అక్కడ తొలిసారిగా హీరోయిన్ మైత్రి (సెహెర్) ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ఇష్ట పడుతుంది.
అయితే ఆమెకు ఒక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. తన అక్క ఆత్మహత్య చేసుకుని “తన చావుకు ఎవరూ కారణం కాదు” అని సూసైడ్ లెటర్ రాసింది. పోలీసులు కూడా అది ఆత్మహత్య అని నిర్ధారించి కేసు క్లోజ్ చేశారు. ఆమెతో పాటు సిటీలో 5 కిలోమీటర్ల పరిధిలోనే మరో రెండు ఆత్మహత్యలు జరిగాయి. వాళ్లు కూడా నా చావుకు ఎవరూ కారణం కాదు అని సూసైడ్ నోట్ రాశారు.

అయితే తన అక్క ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు సిటీకి వచ్చి జాబ్ లో చేరుతుంది మైత్రి.

తన అక్క ఆత్మహత్య వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు హీరో సహాయం కోరుతుంది. ఈలోపులో పోలీసులు కూడా క్లోజ్ చేసిన ఫైలు రీ ఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు.
హీరో సహకారంతో హీరోయిన్ ఆ మిస్టరీని ఛేదించిందా?
పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏమి తేలింది?
ఒకే తరహాలో జరిగిన మూడు ఆత్మహత్యల వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? అన్నది క్లైమాక్స్ లో తేలుతుంది.

ఇది కర్త కర్మ క్రియ సెంట్రల్ పాయింట్. సెల్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగమైన ఈ రోజుల్లో అది ఇతరుల చేతుల్లో పడితే ఎలాంటి దుష్పరిణామాలు ఏర్పడతాయో తెలియజేస్తూ చాలా చక్కటి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు దర్శకుడు నాగు గవర. కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం అనే నాలుగు ప్రధాన బాధ్యతలను తీసుకుని నాగు గవర సినిమాను చక్కగా నడిపించాడు. అయితే ఇంటర్ వెల్ పాయింట్ నుండి అసలు కథలోకి ప్రవేశించిన దర్శకుడు ప్రథమార్ధాన్ని ఆసక్తికరంగా మలచడం మీద దృష్టి పెట్టలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ల పరిచయం, ఆ లవ్ ట్రాక్ లను ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మలిచే అవకాశం ఉన్నప్పటికీ సెకండాఫ్ మీదనే ఎక్కువగా బ్యాంక్ చేసుకోవడం తో ఫస్ట్ హాఫ్ తేలిపోయింది.

అయితే ఒకసారి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవడంతో రైస్ అయిన టెంపోను చివరిదాకా కంటిన్యూ చేయటంలో సక్సెస్ అయ్యాడు జర్నలిస్ట్ టర్న్ డ్ డైరెక్టర్ నాగ గవర.

బడ్జెట్ లిమిటేషన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఉన్నంతలో సినిమాను ఆసక్తిదాయకంగా నడిపించి చదలవాడ బ్రదర్స్ లాంటి సీనియర్ ప్రొడ్యూసర్స్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు .

ఇక నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే కొత్త హీరో వసంత సమీర్ బాగున్నాడు.. చాలా బాగా చేశాడు. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో రవి వర్మ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలెట్ గా చెప్పుకోవాలి. పోలీస్ పాత్రలో ఆయన మంచి నటనను కనబరిచాడు. తాను తప్ప ఈ పాత్ర వేరే వాళ్లు చేయలేరేమో అన్నంతగా ఒదిగిపోయి నటించాడు రవివర్మ. కథలో కీలకమైన ఒక డాక్టర్ పాత్రలో సీనియర్ ఫిలిం జర్నలిస్టు వినాయకరావు కుమారుడు శ్రీ హర్ష చక్కగా నటించాడు. పర్ఫార్మెన్స్ కు అవకాశం ఉన్న హీరోయిన్ మైత్రి పాత్రలో సెహర్ ఓకే అనిపించుకుంది.

బడ్జెట్ లిమిటేషన్స్ దృష్ట్యా చూస్తే మిగిలిన సాంకేతిక అంశాలు, మేకింగ్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి.

మొత్తం మీద సైబర్ క్రైమ్ నేపద్యంలో నిర్మితమైన క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కర్త కర్మ క్రియ ను దర్శకుడు నాగ గవర నీట్ గా హ్యాండిల్ చేశాడనే చెప్పవచ్చు.

Kartha Karma Kriya Movie Review
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=AvPjX_-S58A]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here