డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన యాక్షన్ ఫ్లిక్ సవ్యసాచి

Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Savyasachi Movie Plus Points, Savyasachi Movie Public Talk, Savyasachi Movie Review, Savyasachi Movie Story, Savyasachi Review, Savyasachi Telugu Movie Live Updates, Savyasachi Telugu Movie Public Response, Savyasachi Telugu Movie Review, Savyasachi Telugu Movie Review & Rating, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Savyasachi Movie Review

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
డైరెక్టర్: చందు మొండేటి
మ్యూజిక్: ఎం ఎం కీరవాణి
యాక్షన్: రామ్ లక్ష్మణ్
కెమెరా: యువరాజ్
కాస్టింగ్: నాగ చైతన్య, నిధి అగర్వాల్, మాధవన్,భూమిక, రావు రమేష్, వెన్నెల కిషోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్,నవీన్

కొత్త కథలు, కొత్త కాన్సెప్ట్స్, కొత్తరకం ప్రజెంటేషన్ కోసం ఎదురు చూసే ప్రేక్షకుల ముందుకు “వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్” అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ను ప్రజెంట్ చేస్తూ హీరో నాగ చైతన్య- దర్శకుడు చందు మొండేటి చేసిన ప్రయత్నం సవ్యసాచి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మరి ఆ అంచనాలను సవ్యసాచి ఏ మేరకు అందుకుందో రివ్యూ ద్వారా చూద్దాం.

స్టోరీ లైన్:

విక్రమ్- ఆదిత్య( నాగ చైతన్య) “వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్” అనే ఒక అరుదైన లక్షణం కలిగి ఉంటాడు. అంటే తల్లి గర్భంలో పెరిగిన ఇద్దరు కవలలు కొన్ని జన్యు లోపాల కారణంగా ఒకడిగా పుట్టినప్పటికీ ఒకే శరీరంలో ఇద్దరి లక్షణాలను కలిగి ఉండటం దీని లక్షణం. అంటే రెండవ వాడికి భౌతిక రూపం లేకపోయినప్పటికీ ఒకే శరీరంలో ముఖ్యంగా ఎడమచేతిలో అతని పెరుగుదల నిక్షిప్తమై ఉంటుంది.

ఇలాంటి అరుదైన లక్షణంతో పెరిగిన విక్రమ్ ఒక యాడ్ ఫిలిం మేకర్ అవుతాడు. అతను కాలేజీలో పరిచయమైన చిత్ర(నిధి అగర్వాల్) తో ప్రేమలో పడతాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో వాళ్ల ప్రేమకు 6 సంవత్సరాల వియోగం ఏర్పడుతుంది.

ఏంటిక్ వస్తువులు అమ్మే షాపును నిర్వహిస్తున్న చిత్ర దగ్గరకు తన యాడ్ ఫిలిం ప్రాపర్టీస్ కోసం వస్తాడు విక్రమ్. అలా ఆరేళ్ల తరువాత కలిసిన వాళ్ళిద్దరూ ఒక యాడ్ ఫిలిం షూటింగ్ కోసం అమెరికా బయలుదేరుతారు. వాళ్లతో పాటు అతని అసిస్టెంట్ డైరెక్టర్ వెన్నెల కిషోర్ కూడా వెళ్తాడు. అక్కడ యాడ్ ఫిలిం పూర్తి చేసుకుని వచ్చే సరికి విక్రమ్ ఇల్లు అగ్నిప్రమాదంలో ధ్వంసం అయి ఉంటుంది. అగ్నిప్రమాదంలో బావ చనిపోగా అక్క( భూమిక) గాయాలతో హాస్పటల్లో ఉంటుంది. తను ప్రాణప్రదంగా చూసుకునే మేనకోడలు ఏమైందో తెలియదు. అసలు ఈ విధ్వంసానికి కారణం ఏమిటి? ఆ కుటుంబాన్ని అంత దారుణంగా అటాక్ చేసింది ఎవరు? అంతకుముందు బస్సు ప్రమాదంలో పాతిక మంది ప్రాణాలు కోల్పోవటానికి కారకులు ఎవరు? అసలు జరిగిందేమిటి? జరగబోయేదేమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా నిలుస్తుంది సవ్యసాచి ద్వితీయార్ధం.

నటీనటుల పర్ఫార్మెన్స్:
యాక్షన్ కమ్ మైండ్ గేమ్ కమ్ రొమాన్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న విక్రమ్ పాత్రలో నాగ చైతన్య చాలా బాగా చేశాడు. ఈ కథను, పాత్రను నాగ చైతన్య యాక్సెప్ట్ చేయడానికి అవసరమైన రీజనింగ్, స్టఫ్ ఇందులో బాగున్నాయి. నాన్ – రెగ్యులర్ అండ్ డిఫరెంట్ పాయింట్ తో రూపొందిన ఈ కథకు నాగ చైతన్య ఓకే చెప్పటం మంచి జడ్జిమెంట్ ఆనే అనుకోవచ్చు .

హీరోయిన్ గా నిధి అగర్వాల్ పర్ఫార్మ్ చేయటానికి గొప్ప పాత్ర కాకపోయినప్పటికీ గ్లామర్ అండ్ అప్పియరెన్స్ పరంగా ఓకే అనిపించుకుంది. ప్రస్టేటెడ్ ఇంటలెక్చువల్ క్యారెక్టర్ లో మాధవన్ పర్ఫార్మెన్స్ సింప్లీ సూపర్బ్. మిగిలిన పాత్రలకు పర్ఫార్మ్ చేయటానికి పెద్ద అంతగా ఏమీ లేదు.

విశ్లేషణ:
దర్శకుడు చందు మొండేటి directorial ఎఫిషియన్సీ చాలా సందర్భాలలో అభినందనీయంగా ఉంది. ముఖ్యంగా తాను ఏదైతే డిఫరెంట్ కాన్సెప్ట్ అనే నమ్మకంతో ” “వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్” బ్యాక్ డ్రాప్ లో కథను అల్లుకున్నాడో ఆ పాయింట్ చాలా ఏఫిషి యంట్ గా ప్రజెంట్ చేయగలిగాడు. ముఖ్యంగా హీరో విలన్ మధ్య నడిచే మైండ్ గేమ్ ను ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేశాడు. అయితే ప్రధాన ఇతివృత్తం మీద చూపెట్టిన శ్రద్ధ, కాన్సన్ట్రేషన్ మిగిలిన అంశాలమీద చూపించకపోవడంతో చాలా సందర్భాల్లో డ్రాపింగ్ కనిపిస్తుంది. ముఖ్యంగా కాలేజీ సన్నివేశాలు, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, వాళ్ల అమెరికా ప్రయాణం, అక్కడకు వెళ్లిన కారణం, అక్కడ జరిగిన ప్రహసనం, కాలేజీలో ప్రదర్శించిన సుభద్రా పరిణయం నవ్వు తెప్పిస్తాయి.

ఇక టెక్నికల్ గా, మేకింగ్ వాల్యూస్ పరంగా ఎలాంటి ఆక్షేపణ లేని చిత్రంగా సవ్యసాచి ని అభినందించవచ్చు. కీరవాణి సంగీతంలో రెండు పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. “నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాఎత్తు” అనే రీమిక్స్ అటెంప్ట్ కు ధియేటర్ లో మిశ్రమ స్పందన మాత్రమే లభించింది. యాక్షన్ జయింట్స్ రామ్ లక్ష్మణ్ ల ఫైట్ కంపోజింగ్స్ చాలా బాగున్నాయి. యువరాజ్ కెమెరా ఇతర టెక్నికల్ అంశాలు up to the mark అనిపించాయి. భారీ చిత్రాల భారీ నిర్మాతలు అయిన మైత్రి మూవీ మేకర్స్ మేకింగ్ స్టాండర్డ్స్ ఘనంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
* మెయిన్ ప్లాట్
* హీరో విలన్ ల మైండ్ గేమ్
* నాగచైతన్య – మాధవన్ ల పర్ఫార్మెన్స్

మైనస్ పాయింట్:

* స్లో అండ్ డెప్త్ లెస్ ప్రజెంటేషన్.

” సవ్యసాచి” నిజంగానే ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పవచ్చు. మంచి కథలు ఎంచుకోవడంలో తమకు తామే సాటి అని మైత్రి మూవీస్ మరోమారు నిరూపించింది.

సవ్యసాచి మూవీ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=L-Heh0TfcnY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here