మజిలీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన నాగచైతన్య

Naga Chaitanya Reveals Interesting Facts About Majili,Naga Chaitanya Reveals Details About His New Project,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Naga Chaitanya About His New Project,Naga Chaitanya Movies Latest News,Naga Chaitanya and Samantha Upcoming Combination Movie,Naga Chaitanya Next Project Details,Naga Chaitanya New Film Updates,Naga Chaitanya About Majili Movie
Naga Chaitanya Reveals Interesting Facts about Majili

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జోడిగా కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా మాత్రమే ఈసినిమా పేరు మజిలీగా ఫిక్స్ చేసినట్టు.. తరువాత ఓ మంచి టైటిల్ ను ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు నాగచైతన్య.

చందూమొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా ఈరోజు రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తమ మజిలీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. “శివ నిర్వాణ సినిమాలో మేమిద్దరం భార్యాభర్తల్లానే కనిపిస్తాం. చేయడానికి ఈజీగానే ఉంది. కానీ స్క్రిప్ట్ లో మా పెయిర్ కు గొడవలెక్కువ. సమంత నేను ఎక్కువగా గొడవ పడుతుంటాం. కానీ రియల్ లైఫ్ లో మాత్రం మాకు అలాంటివేం లేవని చెప్పుకొచ్చాడు చై.

మరి రియల్ లైఫ్ లో భార్యభర్తలే రీల్ లైఫ్ లో అది కూడా మళ్లీ భార్యభర్తల్లాగే నటించడం చాలా గమ్మత్తైన విషయమే. నాగచైతన్య, సమంతకు కూడా ఈ రోల్స్ లో నటించడం చాలా ఈజీగా ఉండొచ్చు. మరి రీల్ లైఫ్ లో వీరిద్దరి గొడవలు చూడాలంటే సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=L-Heh0TfcnY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here