రథం మూవీ రివ్యూ

Latest Telugu Film News, Latest Telugu Movie Reviews, Ratham Movie Public Talk, Ratham Movie Review, Ratham Movie Review & Rating, Ratham Movie Story, Ratham Review, Ratham Telugu Movie Live Updates, Ratham Telugu Movie Plus Points, Ratham Telugu Movie Public Response, Ratham Telugu Movie Review, Telugu Filmnagar, Telugu Movies News 2018, Tollywood Cinema Updates
Ratham Movie Review

గీత ఆనంద్, చాందినీ భగ్వానాని జంటగా చంద్రశేఖర్‌ కానూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రథం’. అందరూ కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్ తోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆర్ఎక్స్ 100, అర్జున్ రెడ్డి లాంటి మరో బోల్డ్ అండ్ కల్ట్ స్టోరీ రాబోతుందని…సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుదన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అన్నింటికంటే భిన్నంగా చేయడంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అలాంటి అంచనాల నేపథ్యంలోనే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆర్ఎక్స్ 100, అర్జున్ రెడ్డి సినిమాల్లాగా అంచనాలను రీచ్ అయిందో లేదో చూద్దాం..

నటీనటులు : గీత ఆనంద్, చాందిని భాగవానని
దర్శకుడు : చంద్ర శేఖర్ కానూరి
నిర్మాత : రాజా దారపునేని
సంగీత దర్శకత్వం : సుకుమార్ పమ్మి

కథ

హీరోయిన్ తండ్రి అబ్బులు సమాజంలో జరిగే చెడును ఎదుర్కొనే క్రమంలో జైలు పాలవుతాడు. ఆ తరువాత బయటకు వచ్చినా కూడా కన్న కూతురికి, భార్యకు దూరంగా బ్రతుకుతుంటాడు. ఇక హీరో కు కూడా దాదాపు హీరోయిన్ తండ్రికి ఉన్న లక్షణాలే ఉంటాయి. వ్యవసాయాన్ని ఎంత గానో ఇష్టపడే హీరో..తాను కూడా సమాజంలో జరిగే చెడు పనుల్ని ఏ మాత్రం సహించలేడు. వాటికి ఎదురుతిరిగి పోరాడే తత్వం కలవాడు. అయితే తన తండ్రిని ఏ మాత్రం ఇష్టపడని హీరోయిన్ అవే లక్షణాలున్న హీరోని ప్రేమిస్తుంది. దీంతో తన కూతురికి కూడా తన భార్య అనుభవించిన జీవితం ఎక్కడొస్తుందా అని హీరోని పిలిచి మాట్లాడుతాడు. మారమని చెబుతాడు. కానీ.. హీరో, అంతవరకు వస్తే మీ అమ్మాయి వద్దు అని వెళ్లిపోతాడు. ఇక కన్న కూతురి బాధ తట్టుకోలేక మాట్లాడడానికి హీరో ఇంటికి భార్యతో సహా వెళతాడు హీరోయిన్ తండ్రి. ముందు వాళ్ళని చదువు పేరుతో ఒకే ఊరిలో ఉంచి చదివిద్దాం, చదువు అయ్యాక కూడా వాళ్ళు ఇష్టపడుతుంటే అప్పుడు పెళ్లి చేద్దాం అని హీరో తల్లితో ఒప్పందం పెడతాడు. అందరి అంగీకారంతో హీరో హీరోయిన్ వైజాగ్ వెళతారు. అయితే అక్కడ చిన్నచిన్న మనస్పర్థల వల్ల హీరోయిన్..హీరో వద్దనుకొని..తన తండ్రితో ఆ విషయం చెప్పి విడిపోతుంది. దాంతో హీరో చాలా క్రుంగిపోతాడు. మరి హీరో హీరోయిన్ ఆఖరికి ఎలా కలుస్తారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఇలాంటి బోల్డ్ కటెంట్ తో వచ్చిన సినిమాలకు ఇప్పటికే జనాలు అలవాడుపడిపోయారు కాబట్టి… ఈసినిమా చూసేందుకు కూడా అలాంటి ఇంట్రెస్ట్ తోనే ప్రక్షకులు సినిమాకు వస్తారు. నిజానికి ఈ సినిమాలో హీరో హీరోయిన్ కొత్త వారైనా చాలా చక్కగా నటించారు. ముఖ్యంగా హీరో తన నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. పోస్టర్స్ చూసి ఏదో రొమాంటిక్ సినిమా అనుకుంటారు కానీ..మంచి ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. హీరో, హీరోయిన్ తండ్రికి మధ్య, హీరో-హీరోయిన్ కు మధ్య వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఇక డైరెక్టర్ కు కూడా ఇది మొదటి సినిమా అయినా చాలా అనుభవంతో సినిమా తీసినట్టే ఉంది. సినిమాటోగ్రఫి చాలా బావుంది. తక్కువ బడ్జెట్ సినిమా అయినా నిర్మాణాత్మక విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్
కథ
హీరో హీరోయిన్స్ నటన

మైనస్ పాయింట్స్
స్లోగా సాగే కథనం

మొత్తంగా చూసుకుంటే…రథం సినిమా యూత్ కు నచ్చే ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు.

రథం మూవీ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=8zEkU8fr-2s]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here