ఫ్యాన్సీ రేటుకు శుభలేఖ+లు రైట్స్

SubhaLekhaLu Movie Rights for a Fancy Rate,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,SubhaLekhaLu Movie Latest Updates, SubhaLekhaLu Movie Gets a Fancy Rate,SubhaLekhaLu Telugu Movie Rights for a Fancy Rate,Subhalekhalu Bought at a Fancy Price From the Makers,Subhalekhalu Movie Bought a Fancy Price
SubhaLekhaLu Movie Rights for a Fancy Rate

ఒకప్పటి జనరేషన్ కి.. ఇప్పటి జనరేషన్ ఆలోచనా విధానానికి ఉన్న తారతమ్యాన్ని చెప్పే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమే శుఖలేఖలు. కొత్త హీరో హీరోయిన్లతో తెరకెక్కిన ఈ సినిమాలో ఈ జనరేషన్ యూత్ ఆలోచనా విధానాన్ని చూపించనున్నట్టు ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను బట్టి చూస్తే అర్ధమైపోయింది. అందరూ కొత్తవారితో తెరకెక్కిన ఈ సినిమా..పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ లు విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్ లోను, ఇటు మార్కెట్ లోను ఓ క్యూరియాసిటీ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా రైట్స్ కూడా భారీ మొత్తంలో అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని పుష్యమి ఫిలిం మేకర్స్ అధినేత బెల్లం రామకృష్ణా రెడ్డి చూసి చాలా ఇంప్రెస్ అయ్యి , ఫ్యాన్సీ ఆఫర్ తో ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు. సుమారు మూడున్నర కోట్లకు పైగా మొత్తానికి వరల్డ్ వైడ్ థియేటర్, ఇంకా డిజిటల్, శాటిలైట్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బెల్లం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ ” ఈ సినిమా హక్కులని సొంతం చేసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫీల్ గుడ్ సినిమా రాలేదు.. చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది.. అటుయూత్, ఇటు ఫ్యామిలిస్ అందరికీ ఈ మూవీ నచ్చుతుందనే నమ్మకo ఉందని అన్నారు.

కాగా శ‌ర‌త్ న‌ర్వాడే ద‌ర్శ‌కత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ప్రియా వ‌డ్ల‌మాని.. వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్ర‌ధారులుగా చేస్తున్నారు. హ‌నుమా తెలుగు మూవీస్ ప‌తాకంపై సి.విద్యాసాగ‌ర్‌, ఆర్‌.ఆర్‌.జ‌నార్ద‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌థ – మాట‌లు: జ‌నార్ద‌న్‌ -విస్సు, సంగీతం: కేఎమ్ రాధాకృష్ణ‌న్‌, కెమెరా: ముర‌ళీమోహ‌న్ రెడ్డి, ఎడిటింగ్‌: మ‌ధు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=Z3-SGZISGmo]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here